భూమిపై ఏలియన్స్ కలకలం.. సైనికుల్ని రాళ్లుగా మార్చేసిన వింత ఘటన!

సైబీరియాలో( Siberia ) 35 ఏళ్ల కిందట జరిగిందీ షాకింగ్ స్టోరీ.అప్పట్లో సోవియట్ సైనికులకి,( Soviet Soldiers ) గ్రహాంతరవాసులకి( Aliens ) మధ్య జరిగిన ఓ వింత ఎన్‌కౌంటర్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.

 Did Alien Creatures Turn Russian Troops Into Stone Details, Alien Encounter, Sib-TeluguStop.com

అసలు విషయం ఏంటంటే, ఆ ఎన్‌కౌంటర్‌లో సైనికులంతా రాళ్లుగా( Stones ) మారిపోయారట.ఈ రహస్యం బయటపెట్టింది ఎవరో కాదు, అమెరికా గూఢచారి సంస్థ CIA.టాప్ సీక్రెట్ అనుకున్న ఈ ఫైల్స్ 2000 సంవత్సరంలో డీక్లాసిఫై అయ్యాయి.అంటే, రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని బయటపెట్టారన్నమాట.

అవి 250 పేజీల డాక్యుమెంట్స్.

రిపోర్ట్ ప్రకారం, సోవియట్ మిలిటరీ యూనిట్ వాళ్లు ట్రైనింగ్ చేస్తున్నారు.

అంతలో ఆకాశంలో ఒక వింత ప్లేట్ లాంటి వస్తువు కనిపించింది.అదే UFO, అంతే, ఒక సైనికుడు వెంటనే సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ పేల్చేశాడు.

ఆ రాకెట్ ధాటికి UFO కూలిపోయింది.కూలిపోగానే దానిలోంచి ఐదుగురు వింత జీవులు బయటికి వచ్చారు.

వాళ్లకి పెద్ద పెద్ద తలలు, నల్లటి కళ్లు ఉన్నాయట.

Telugu Alien, Cia Alien, Kgb Alien, Siberia, Sovietsoldiers-Telugu NRI

సైనికులు షాక్ లో చూస్తుండగానే, ఆ ఐదుగురు ఏలియన్స్ దగ్గరగా వచ్చి ఒకరిలో ఒకరు కలిసిపోయారట.ఒక్కటైపోయి మెరిసే తెల్లటి బంతిలా మారి గిర్రున తిరుగుతూ భయంకరమైన శబ్దాలు చేశారట.ఒక్క క్షణం, దాంతో ఒక్కసారిగా అది పేలిపోయింది.

భరించలేని కాంతి వెలువడింది.ఆ వెలుగు ధాటికి ఏకంగా 23 మంది సైనికులు రాళ్లుగా మారిపోయారు.

అదృష్టవశాత్తు, ఇద్దరు సైనికులు మాత్రం నీడలో ఉండటం వల్ల బతికిపోయారు.

రాళ్లుగా మారిన సైనికుల్ని చూస్తే సున్నపురాయిలా ఉన్నారట.

అసలు ఆ వింత ఆయుధం ఏంటి, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు.వెంటనే UFO శకలాలు, రాళ్లుగా మారిన సైనికుల అవశేషాలు అన్నిటినీ మాస్కో దగ్గరలోని ఒక సీక్రెట్ రీసెర్చ్ సెంటర్ కి తరలించారట.

Telugu Alien, Cia Alien, Kgb Alien, Siberia, Sovietsoldiers-Telugu NRI

ఈ విషయం జోష్ హూపర్ అనే వ్యక్తి ‘ఈవిల్’ అనే పాడ్‌కాస్ట్‌లో తాజాగా చెప్పాడట.అంతేకాదు, 1993 మార్చిలో ఉక్రెయిన్‌కి చెందిన ‘హోలోస్ ఉక్రేయిని’ అనే న్యూస్‌పేపర్‌లో కూడా ఈ విషయం గురించి రాశారట.సోవియట్ యూనియన్ కూలిపోయాక, KGB దగ్గర ఉన్న ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ CIA కి ఎలాగోలా చేరాయని అంటున్నారు.

ఇది ఎప్పుడు జరిగిందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు కానీ, బహుశా 1989 లేదా 1990 ప్రాంతంలో జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఒక CIA అధికారి ఏమన్నారంటే, KGB రిపోర్ట్ నిజమైతే, ఇది చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఏలియన్ ఎన్‌కౌంటర్లలో ఒకటి అవుతుందని చెప్పారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube