1.మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని కెసిఆర్ ప్రకటించారు.
2.ఢిల్లీ డిప్యూటీ సీఎం అనుచరుడి ఇంట్లో ఈడి సోదాలు
ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా ముఖ్య అనుచరుడు దినేష్ అరోరా ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు.
3.సిబిఐ డైరెక్టర్ ను కలవనున్న షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.ఈరోజు సిబిఐ డైరెక్టర్ ను ఆమె కలిసి కెసిఆర్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయనున్నారు.
4.మునుగోడు లో వామపక్షాల బహిరంగ సభ
త్వరలోనే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వామపక్ష పార్టీలు భారీ బహిరంగ సభను ఈ నెల 12 న నిర్వహించే ప్లాన్ లో ఉన్నాయి.
5.యువభారత్ పార్టీగా కాంగ్రెస్ ను మార్చాలి
యువభారత్ పార్టీగా కాంగ్రెస్ ను మార్చాలని తాను భావిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్న మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ అన్నారు.
6.బండి సంజయ్ సవాల్
భారత్ రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణలో గెలుస్తామని ధీమా ఉంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని కెసిఆర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.
7.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయదని జెడిఎస్ నేత కుమార్ స్వామి అన్నారు.
8.ఏపీలో బీఆర్ఎస్ బ్యానర్లు
ఏపీలోని అమలాపురం లో కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ ఎస్ పార్టీ జెండాలు వెలిశాయి.అమలాపురం పార్లమెంట్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి రేవు అమ్మాజీ అంటూ ఆ ఫ్లెక్సీ ల్లో ఉంది.
9.బీఆర్ ఎస్ పై ఏపీ బీజేపీ స్పందన
దేశంలో కే ఏ పార్టీకి, కేసీఆర్ బీ ఆర్ ఎస్ పార్టీకి మధ్య పెద్ద తేడా ఏమీ లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.
10.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.స్వామి వారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది.
11.ఏపీకి కేంద్రం నిధుల విడుదల
ఏపీకి కేంద్ర.నిధులను విడుదల చేసింది.ఏడో విడత రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 879 కోట్లు విడుదల చేసింది.
12.నేటి నుంచి మునుగోడు లో నామినేషన్లు
మునుగోడు అసెంబ్లీ ఓపి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈరోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు.
13.వారసత్వ కట్టడంగా ధవలేశ్వరం బ్యారేజ్
ధవలేశ్వరం బ్యారేజ్ ను ప్రపంచ వారసత్వ కట్టడంగా ఐ సీ ఐ డి (ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ గుర్తించింది.
14.పోలవరం పై నేడు కీలక సమావేశం
పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు ఉదయం 11 గంటలకు వర్చువల్ గా కీలక సమావేశం జరిగింది నాలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు పాల్గొన్నారు.
15.ఈడీ విచారణకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు.యంగ్ ఇండియా సంస్థ పై నమోదయిన కేసులో భాగంగా విచారణకు హాజరయ్యారు.
16.దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనం
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది.
17.ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం
ఏపీలో నేటి నుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
18.ఈ నెల 26 నుంచి కార్తీక మాస ఉత్సవాలు
ఈ నెల 26 నుంచి కార్తీక మాస ఉత్చవాలు ప్రారంభం కానున్నాయి.దీంతో శ్రీశైలంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
19.మునుగోడు లో టీజేఎస్ పోటీ
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలంగాణ జన సమితి (టీ జే ఎస్ ) పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడతామని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,850
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,200
.