సినిమా విజయం సాధించాలంటే అన్ని విభాగాలు చక్కటి కోఆర్డినేషన్‌తో పనిచేయాలి.ఎక్కడా అశ్రద్ధ పనికిరాదు.24 ఫ్రేమ్స్ అద్భుతంగా ఉండాలి.అప్పుడే అనుకున్న ఔట్ ఫుట్ వస్తుంది.
కానీ కొన్నిసార్లు హీరో నటన మీదే ఆధారపడి సినిమాలు నడిచిన సందర్భాలు ఉన్నాయి.వారి నటన మూలంగానే డిజాస్టర్ కావాల్సిన సినిమాలు యావరేజ్‌తో సరిపెట్టుకుంటాయి.
అలా తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి.హీరో ఫర్ఫార్మెన్స్ మీదనే నడిచిన తెలుగు సినిమాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
సోగ్గాడే చిన్నినాయన:
ఈ సినిమా నిజానికి డిజాస్టర్ కావాలి.ఆయా సంస్థలు ఈ సినిమాకు కేవలం 2.5 రేటింగ్ ఇచ్చాయి.కేవలం నాగార్జున నటనతో ఈ సినిమా యావరేజ్‌గా నడిచింది.నెమ్మదిగా పుంజుకుంటూ 48 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
పవర్:
టైటిల్ లో సూపర్ పవర్ ఉన్నా.సినిమాలో అనుకున్నంత దమ్ము లేదు.కేవలం రవితేజ నటన కారణంగానే ఈ సినిమా నడిచంది.అపజయం తప్పదనుకున్నా.తప్పించుకుంది.మొత్తంగా ఈ సినిమా 52 కోట్ల రూపాయలు సాధించింది.
సరైనోడు:
కథ పరంగా ఈ సినిమా అంత గొప్పదేం కాదు.కానీ అల్లు అర్జున్ నటనతో నడిపించాడు.మంచి యాక్షన్‌తో తన భుజాలపై సినిమాను నడిపించాడు.ఈ సినిమా 76 కోట్ల రూపాయలు సాధించి.విజయంగా నిలిచింది.
జనతా గ్యారేజ్:
కథ, కాన్సెప్ట్ బాగున్నా.తొలుత ఈ సినిమా మామూలుగా మొదలైంది.సినిమా రిలీజ్ అయిన తర్వాత ఊపందుకుంది.
ఎన్టీఆర్ సహా పలువురి క్యారెక్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమా 82 కోట్ల వసూలు చేసింది.
మంచి విజయం అందుకుంది.
MCA:
ఈ సినిమా ప్లాప్ టాక్ తో మొదలైంది.నాని నటనతో కాస్త పుంజుకుంది.నెమ్మదిగా ఫర్వాలేదు అనే స్థాయిక చేరింది.చివరకు 40 కోట్ల రూపాయలు సాధించింది.
F2:
కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా కూడా మొదట యావరేజ్ టాక్ తెచ్చుకుంది.ఆ తర్వాత వెంకీ, వరుణ్ నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.
నెమ్మదిగా ఊపందుకుని 80 కోట్లకు పైగా రూపాయలు రాబట్టింది.
మహర్షి:
మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా నెగెటివ్ టాక్‌తో మొదలైంది.కానీ ప్రిన్స్ నటన మూలంగా సినిమా నిలబడింది.ఏకంగా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మంచి విజయాన్నిఅందుకుంది.
ఇష్మార్ట్ శంకర్:
రామ్ హీరోగా చేసిన ఈ సినిమా కూడాఈ డల్ టాక్‌తో మొదలైంది.కేవలం 2.75 రేటింగ్స్ సాధించింది.అనంతరం రామ్ మాస్ క్యారెక్టర్ జనాలకు బాగా నచ్చింది.37 కోట్ల రూపాయలు సాధించింది.