అనడానికి మతిమరుపు వయసు పెరిగినా కొద్ది వస్తుందని లేదా పెరుగుతుందని అంటుంటారు కాని, నిజానికి మతిమరుపుకి వయసుతో సంబంధమే లేదు.జీన్స్ వలనో, మన అలవాట్ల వలనో, మతిమరుపు అనేది ఏ వయసు వారికైనా రావొచ్చు.
మీకు కూడా అలాంటి సమస్యే ఉంటే, ఈ ఆహార పదార్థాలు మీకోసమే.
* ఉదయాన్నే కాఫీ తాగడం మెదడు చురుకుగా పనిచేయాడానికి ఉపయోగపడేదే అయినా, గ్రీన్ టీ లాభాల ముందు కాఫీ కూడా దిగదుడుపే.
ఇందులో ఉండే పాలిఫెనల్స్ మీ మెదడు యొక్క నరాల పనితనాన్ని మేరుగుపరించి మతిమరుపు తగ్గిస్తుంది.
* చేపలు తినే అలవాటు ఉంటే సాల్మన్ ఫిష్ ఎక్కువగా తినండి.
ఇందులో ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ మెండుగా ఉంటాయి.అందులో DHA అనే ఆసిడ్ మేమోరిని షార్ప్ చేస్తుంది.
* పసుపు మెదడు పనితనాన్ని ఎలా ప్రబావితం చేస్తుంది అనే విషయం మీద పరిశోధనలు బాగానే జరిగాయి.అన్నిచోట్ల పసుపు మెదడుకి ఏంతో ఉపయోగకరమని తేల్చారు.పసుపు మెదడుకి ఆక్సిజన్ బాగా సప్లై చేస్తుందట.దాంతో విషయం మర్చిపోవడం పెద్దగా జరిగే పని కాదు.
* ఎలాంటి సందేహం లేకుండా విటమిన్ కే లభించే గ్రీన్ వెజిటబుల్స్ తినండి.మీ మతిమరుపు ఎందుకు పారిపోదో చూద్దాం.
* కొబ్బరి నూనె కీటోన్ బాడీస్ లో బ్లడ్ ఫ్లో పెంచుతుంది.దాంతో మీ మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది.
* బ్లూబెర్రిస్, ఆలివ్ ఆయిల్, కిన్నామోన్ . ఇలాంటి ఆహార పదార్థాలు కూడా మతిమరుపు తాగ్గిస్తాయని న్యూట్రిషన్స్ చెబుతున్నారు.