ఒత్తిడి, ఆందోళన, ఫోన్ ను అధికంగా చూడడం, ఆహారపు అలవాట్లు.తదితర కారణాల వల్ల చాలా మందికి రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టదు.
నిజానికి కంటి నిండా నిద్ర లేకపోవడం వల్లే మనకు 90 శాతం జబ్బులు వస్తుంటాయి.అందుకే రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోతే.ఇక వారి బాధ వర్ణనాతీతం.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? కంటికి కునుకు కరువైందా.? నిద్ర పట్టడం కోసం స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నారా.? అయితే వాటిని ఆపండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే గింజలను తింటే సహజంగానే మీకు నిద్ర తన్నుకొస్తుంది.ఎటువంటి పిల్స్ అక్కర్లేదు.మరి ఇంతకీ ఆ గింజలు ఏంటో తెలుసా.గుమ్మడి గింజలు.
అవును, రోజు నైట్ నిద్రించే ముందు రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ) తింటే వద్దన్నా కూడా నిద్ర ముంచుకొస్తుంది.గుమ్మడి గింజల్లో ముఖ్యమైన అమైనో ఆమ్లం, ట్రిప్టోఫాన్ ఉంటుంది.
ఇవి నిద్రను ప్రేరేపించే న్యూరోట్రాన్స్‌మిటర్ సెరోటోనిన్‌ను తయారు చేయడానికి ఉపయోగపడతాయి.

అదే సమయంలో ఒత్తిడి( Stress ), ఆందోళనను తొలగిస్తాయి.మెదడు, మనసును రిలాక్స్ అయ్యేలా చేస్తాయి.క్లియర్ కట్ట గా చెప్పాలంటే గుమ్మడి గింజలు సహజ స్లీపింగ్ ప్రమోటర్ గా పనిచేస్తాయి.
కాబట్టి రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదని బాధపడుతున్న వారు, నిద్రలేమితో సతమతం అవుతున్న వారు కచ్చితంగా రోజు నైట్ రెండు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలను తినండి.దాంతో మీరు హాయిగా, ప్రశాంతంగా నిద్రపోతారు.

పైగా గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.రోజుకు రెండు స్పూన్లు గుమ్మడి గింజలు తింటే ఎముకల బలహీనత( Weak Bones ) ఏర్పడకుండా ఉంటుంది.కీళ్ల నొప్పులకు దూరంగా ఉండవచ్చు.అలాగే గుమ్మడి గింజలను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.మెదడు పనితీరు సైతం మెరుగుపడుతుంది.