సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.కానీ హెయిర్ గ్రోత్ మాత్రం ఉండదు.
దీనివల్ల రోజు రోజుకి జుట్టు సన్నగా మారిపోతూ ఉంటుంది.అయితే జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహించడానికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్( Oil ) చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ ఆయిల్ ను వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి,( Moringa Powder ) రెండు టేబుల్ స్పూన్లు వేపాకు పొడి వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ లవంగాలు,( Cloves ) పావు కప్పు డ్రై రోజ్ మేరీ ఆకులు వేసుకోవాలి.చివరిగా అర గ్లాస్ కొబ్బరి నూనె, అర గ్లాస్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత గ్లాస్ జార్ కు మూత పెట్టి ఏడు రోజుల కదపకుండా ఒకచోట పెట్టేయాలి.
సెవెన్ డేస్ పూర్తయిన తర్వాత ఆయిల్ రెడీ అవుతుంది.అప్పుడు గ్లాస్ జార్ లో నుండి పల్చటి క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.కురుల ఆరోగ్యానికి ఈ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది.
స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి తయారు చేసుకున్న ఆయిల్ ను పట్టించి మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా నెక్స్ట్ డే తేలిక పాటి షాంపూతో తలస్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.
ఈ ఆయిల్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని చాలా వేగంగా అరికడుతుంది.అదే సమయంలో జుట్టు ఎదుగుదలను( Hair Growth ) ప్రోత్సహిస్తుంది.
కురులను ఒత్తుగా పొడుగ్గా మారుస్తుంది.అలాగే ఆయిల్ తయారీలో వేప పొడిని వాడటం వల్ల అందులోని యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును తొలగిస్తాయి.
స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.కాబట్టి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలి అని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన విధంగా ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.