ఇంట్లోనే ఇలా చర్మానికి విటమిన్ సి ట్రీట్మెంట్ ఇవ్వండి.. అందంగా మెరిసిపోండి!

విటమిన్ సి.మన శరీరానికి అవసరం అయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ఒకటి.

 Give The Skin A Vitamin C Treatment At Home! Vitamin C Treatment, Vitamin C, Ski-TeluguStop.com

రోగ నిరోధక వ్యవస్థను బలపరచడం లో విటమిన్ సి ముఖ్య పాత్రను పోషిస్తుంది.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా విటమిన్ సి ఎంతో అవసరం.

ముఖ్యంగా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా చర్మానికి విటమిన్ సి ట్రీట్మెంట్ ను ఇస్తే మీరు ఊహించని ఎన్నో లాభాలు మీ సొంతం చేసుకోవచ్చు.అందంగా మెరిసిపోవచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆలస్యం చర్మానికి విటమిన్ సి ట్రీట్మెంట్ ను ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం పదండి.

ముందు రెండు విటమిన్ సి టాబ్లెట్స్ ను తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ లో విటమిన్ సి పౌడర్ ను వేసుకోవాలి.అలాగే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ ను వేసుకుని విటమిన్ సి పౌడర్ క‌రిగేంత వరకు బాగా మిక్స్ చేయాలి.

చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్ వేసి మరోసారి మిక్స్ చేసుకుంటే హోమ్ మేడ్ విటమిన్ సి సీరం సిద్ధం అవుతుంది.

Telugu Tips, Skin, Latest, Skin Care, Skin Care Tips, Vitamin-Telugu Health

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజులో ఏదో ఒక సమయంలో ముఖాన్ని వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న విటమిన్ సి సీరంను దూది సహాయంతో చ‌ర్మంపై అప్లై చేసుకోవాలి.ఈ విటమిన్ సి సీరంను రోజుకు ఒకసారి వాడటం వల్ల చర్మం బ్రైట్ గా, అదే సమయంలో హైడ్రేటెడ్ గా మారుతుంది.

Telugu Tips, Skin, Latest, Skin Care, Skin Care Tips, Vitamin-Telugu Health

ఈ సీరం ను వాడటం వల్ల డ్రై స్కిన్ సమస్యకు స్వస్తి పలకవచ్చు.పిగ్మెంటేషన్ సమస్యను వదిలించడంలోనూ ఈ విటమిన్ సి సీరం గ్రేట్ గా సహాయపడుతుంది.అంతే కాదు ఈ విటమిన్ సి సీరంను రోజుకు ఒక‌సారి వాడటం వల్ల చర్మంపై మొండి మచ్చలు మాయం అవుతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

డార్క్ సర్కిల్స్ సమస్య నుంచి సైతం విముక్తి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube