తెలుగు సినిమా అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కానీ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకులు మాత్రం ఎవరికీ గుర్తుకురారు.
నిజానికి దర్శకుడు లేకపోతే సినిమాలనేవి ఉండవు.మరి దానికి తగ్గట్టుగానే వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న స్టార్ డైరెక్టర్లు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం సూపర్ సక్సెస్ లను అందుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు.ఇప్పటికే ఆయన చేసిన దసర సినిమా( Dasara Movie ) భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చింది.మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

మరి తను అనుకున్నట్టుగా తనతో సూపర్ సక్సెస్ ను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక చిరంజీవితో( Chiranjeevi ) చేయబోతున్న సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఆ సినిమా స్టోరీని కంప్లీట్ చేసి పక్కన పెట్టినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇది ఒక గ్యాంగ్ స్టర్ మూవీ కి సంబంధించిన సినిమాగా తెలుస్తోంది.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు.తద్వారా చిరంజీవిని ఎలా చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే చిరంజీవికి ఒక భారీ సక్సెస్ ని అందించి చిరంజీవి రేంజ్ ను పెంచుతూ తను కూడా స్టార్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
.







