ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు నిద్రలేమి సమస్య వల్ల బాధపడుతున్నారు.మరి కొంతమందిలో ఈ సమస్య దీర్ఘకాలం పాటు ఉంటుంది.
దీనివల్ల భవిష్యత్తులో మానసిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.దీనివల్ల కొంతమంది నిద్ర రావడానికి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు.
రాత్రిపూట నిద్ర రాకపోవడం వల్ల కొంత మంది డ్రగ్స్ మద్యపానం వంటి చెడు అలవాట్లకు బానిసలుగా మారి, రకరకాల వ్యాధులను తెచ్చుకుంటూ ఉన్నారు.ప్రతిరోజు మంచి నిద్ర రావడం కోసం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆ సమస్య తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లలో భిన్నమైన మార్పులు వచ్చాయి.ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్ ను, సాఫ్ట్ కూల్ డ్రింక్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉన్న హానికరమైన కెమికల్స్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
దీనివల్ల మానసిక ఒత్తిడి ఏర్పడి నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది.అందుకే ప్రతిరోజు సహజ సిద్ధంగా దొరికే కూరగాయలు, పండ్లు చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలు తాగితే ఇందులో ఉండే ప్రోటీన్స్ మెదడు కణాలను శాంతపరిచి మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి.అలా జరగడం వల్ల రాత్రిపూట మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే రాత్రి నిద్రించే సమయంలో సాధ్యమైనంత వరకు కాఫీ, టీ, కూల్డ్రింక్స్ మసాలా ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కాస్త శరీరక శ్రమ కలిగేలా వ్యాయామం, వాకింగ్ చేయడం కూడా మంచిదే.
నిద్రించే సమయంలో పడకగది సాధ్యమైనంత వరకు పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం వల్ల మంచి నిద్ర కలిగే అవకాశం ఉంది.