గోపీచంద్ మలినేని జాట్ తెలుగు వెర్షన్ ఆలస్యం కానుందా.. అసలు కారణాలు ఇవేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఈ దర్శకుడు బాలయ్యతో తెరకెక్కించిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

 Jaat Movie Telugu Version Shocking Update Details, Jaat Movie, Gopichand Malinen-TeluguStop.com

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ బ్యానర్ నిర్మాతలకు సైతం గోపీచంద్ మలినేని దగ్గరయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే గోపీచంద్ మలినేని తెరకెక్కించిన జాట్ సినిమా( Jaat Movie ) ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానుంది.

తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఊరమాస్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కగా తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సన్నీ డియోల్( Sunny Deol ) ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది.

Telugu Jaat, Jaat Telugu, Sunny Deol, Sunny Deol Jaat, Tollywood-Movie

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే హిందీ బెల్ట్ లో సైతం గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది.గత కొన్నేళ్లలో బాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఊహించని స్థాయిలో తగ్గింది.సౌత్ సినిమాలను ఆదరించిన స్థాయిలో బాలీవుడ్ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను ఆదరించకపోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.గోపీచంద్ మలినేని పారితోషికం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

Telugu Jaat, Jaat Telugu, Sunny Deol, Sunny Deol Jaat, Tollywood-Movie

గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో సినిమా ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాల్సి ఉంది.బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.జాట్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కొంతమేర పోటీ అయితే ఉంది.ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆలస్యం అవుతోందని డబ్బింగ్ పనుల ఆలస్యమే ఇందుకు కారణమని భోగట్టా.

ఈ సినిమా తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube