కొన్ని సినిమాలు ఎప్పుడు ఎవరిని ఎటు తీసుకు వెళ్తాయో చెప్పడం కష్టం.కొన్ని చిత్రాలు కొందరి జీవితాలను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తే.
మరికొన్ని సినిమాలు నట్టేట ముంచుతాయ.అలా భారీ దెబ్బతో చతికిల పడిన ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు దశ మార్చింది ఓ చిన్న సినిమా.
హీరోగా ఉదయ్ కిరణ్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలించింది.ఇంతకీ ఆ సినిమా ఏంటో.ఇప్పుడు తెలుసుకుందాం.
15 కోట్ల రూపాయలతో వెంకటేష్ హీరోగా తీసిన సిననిమా దేవి పుత్రుడు.ఈ సినిమా బాక్సీఫీసు దగ్గర బోల్తా కొట్టడంతో నిర్మాత ఎమ్మెస్ రాజు ఆర్థికంగా చితికిపోయాడు.అంత బడ్జెట్ తో తీసినా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్థం కాలేదు.
ఈ సినిమా లాస్ పూడ్చుకోవడానికి ఇంకో సినిమా తీయాలి అనుకున్న రాజు.తన ఆప్తుడు గోపాల్ రెడ్డికి విషయం చెప్పాడు.
ఆదిత్య అనే కుర్రాడికి మంచి టాలెంట్ ఉందని.ఓ సారి తనతో మాట్లాడాలని ఫోన్ నెంబర్ చెప్పాడు.
రాజు.ఆదిత్యకు రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు.
ఆదిత్య మాత్రం.ఆయన తనతో సినిమాలు ఏం చేస్తాడు అని భావించాడు.
అయినా ఓ రోజు ఆదిత్య రాజు ఆఫీసుకు వెళ్లాడు.రెండు కథలు చెప్పాడు.
వాటిలో రాజుకు ఓ స్టోరీ బాగా నచ్చింది.
ఎప్పుడో రిలీజ్ అయిన ఆన్ మోల్గడి అనే సినిమా ప్రేరణతో ఈ స్టోరీ రెడీ చేశారు.రాజు, ఆదిత్య స్క్రిప్ట్ పూర్తి చేశారు.హీరో వానలో ఏడుస్తుంటే.
ఒరేయ్ వర్షం కూడా అప్పుడప్పుడు మనకి మేలు చేస్తుంది.మన కన్నీళ్లు కూడా ఎదుటివారికి కనిపించకుండా దాచేస్తుందని హీరో ఫ్రెండ్ చెప్పే డైలాగ్ రాజుకు ఎంతో నచ్చుతుంది.
వెంటనే 25 వేల రూపాయల చెక్ ఆదిత్యకు అడ్వాన్స్ గా ఇస్తాడు.మూవీ అనౌన్స్ చేస్తారు.
సినిమా పేరు మనసంతా నువ్వే.
హీరోగా మహేష్ బాబు అయితే బాగుంటుంది అనుకున్నారు.
తను వేరే ప్రాజెక్టు చేస్తుండటంతో కొత్త అబ్బాయి అయితే బాగుంటుంది అనుకున్నారు.అప్పుడే ఉదయ్ కిరణ్ అనుకున్నారు.
తను అప్పుడు నువ్వు నేను సినిమా షూటింగ్ లో ఉన్నాడు.ఆ మూవీ రష్ చూసి ఓకే చేశారు.
కోటి ముప్పై లక్షలతో షూటింగ్ మొదలు పెట్టారు.నువ్వు నేను విడుదలై మంచి విజయం సాధించడంతో ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయ్యాడు.
అక్టోబర్ 19, 2001 లో మనసంతా నువ్వే సినిమా విడుదల అయ్యింది.ఈ లవ్ స్టోరీ జనాల గుండెల్లో నిలిచింది.36 సెంటర్లలో 100 రోజులు ఆడింది.12 కోట్ల రూపాయలు వసూలు చేసింది.ఎమ్మెస్ రాజు కష్టాలు తీర్చింది.