తెలంగాణలో మరో రాజకీయ సమరం మొదలు కానుంది.వరుస పెట్టి జరుగుతున్న ఎన్నికలతో నాయకులు బిజీబిజీగా మారారు.
ప్రభుత్వం మీద మాటల తూటాలు పేలుస్తూ ప్రతిపక్షాలు రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య వైరంతో రాజకీయాలు రంజుగా మారినా, ఇక దుబ్బాకలో ఎన్నికల విజయంతో బీజేపీ ఒక్కసారి తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
అప్పటి వరకు బీజేపీకి ఓటు వేద్దామని అనుకున్న కొంతమంది ప్రజలకు బీజేపీ విజయంతో బీజేపీ, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని భావించి బీజేపీకి మద్దతు పలకడం మొదలుపెట్టారు.అందుకే గ్రేటర్ లో నాలుగు సీట్లు ఉన్న బీజేపీ, ఒక్కసారిగా 40 కి పైగా సీట్లు సాధించి అందరినీ అబ్బురుపరిచింది.
అయితే ఎప్పటికి ఒకే రోజులు ఉండవన్నట్టు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమిని చవి చూసింది బీజేపీ.అయితే ఆ ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని కార్పొరేషన్ ఎన్నికలో గెలుపుకు ఓ వ్యూహాన్ని రచించింది.
ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగం అనేది హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం.ఈ అంశాన్ని ఆధారం చేసుకొని నిరుద్యోగులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును తీసుకొచ్చి దానిని బీజేపీ వైపు మల్లించుకుంటే బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పవచ్చు.
మరి బీజేపీ సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.