సంఘర్షణ, మానవుడు దానవుడు, ఇంటిగుట్టు వంటి సినిమాల్లో వరసగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను చూరగొన్న అలనాటి తార నళినీ జీవిత ప్రయాణం అసాధారణంగా కొనసాగింది.ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నళినీ మూర్తి, ప్రేమ అనే దంపతులకు తమిళనాడు లో జన్మించారు.ఆమె తల్లి ప్రొఫెషనల్ డాన్సర్ కాగా.
తండ్రి తమిళ మూవీలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసేవారు.అయితే నళినీ ఏడవ తరగతి పూర్తి చేసి 8వ తరగతి లోకి అడుగు పెట్టిన టైమ్ లోనే ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి.
తండ్రి కొరియోగ్రాఫర్ కావడంతో ఆయన ఇంటికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తరచూ వస్తుండేవారు.అప్పుడే నళినీ ని చూసి తమ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామని చెప్పేవారు.
దీంతో తల్లిదండ్రులు ఆమెను సినిమా రంగానికి పరిచయం చేశారు.
అయితే ఆమె హీరోయిన్ గా చేసిన అన్ని సినిమాలు వరుసగా హిట్స్ కావడంతో తల్లితండ్రులు ఆమెను చదువు మాన్పించి సినిమాల్లోనే నటింప చేశారు.
అప్పట్లో సక్సెస్ఫుల్ యాక్టర్ గా కొనసాగిన ఆమె రోజులో 20 గంటలకు పైగా మూవీ షూటింగ్స్ లోనే పాల్గొనే వారట.నిద్ర పోవడానికి కనీసం నాలుగు గంటల సమయం కూడా ఉండకపోయేదట.
ప్రశాంతంగా తినడానికి, పడుకోవడానికి సమయం దొరకకపోయేసరికి.ఆమె ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకునేవారు.
పదమూడేళ్లలోనే ఆమె సినిమా షూటింగ్ లలో చాలా బిజీ అయిపోయారు.తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇంట్లో వాళ్ళు సినిమాల్లో నటించమని చెబుతున్నారని వారిపై ఆమె ఎక్కువగా కోపం పెంచుకునేవారు.
వారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లోనే ఆమె ఉండేవారు.ఒకానొక సమయంలో తనని పెళ్లి చేసుకునే వాడు సినిమాల పేరు ఎత్తకుండా.
తనకి మంచిగా తినడానికి, ఎక్కువసేపు పడుకోవడానికి స్వేచ్ఛ ఇస్తే చాలు అని నళినీ అనుకునేవారట.
అప్పట్లో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన రామరాజన్ నళినీ ని ప్రేమించేవారట కానీ ఈ విషయం తెలిసిన నళినీ అమ్మ బాగా కోపంతో ఊగిపోయేవారట. నళినీ ని రామరాజన్ కి కలవకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే వారట.అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలో నిఘా పెట్టేవారట.
అయితే ఒక రోజు నళినీ రామరాజన్ తో కలిసి షూటింగ్ కి రావడంతో.ఈ విషయం తెలుసుకున్న తల్లి తమ కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని షూటింగ్ స్పాట్ కి వచ్చి రామరాజన్ ని చితక్కొట్టారు.
దీనితో తన కారణంగా ఒక మనిషి దెబ్బలు తిన్నాడని బాగా బాధపడిపోతూ నళినీ ఆలోచనలో పడిపోయారట.
అయితే అప్పుడే ఆయనపై ప్రేమ కలిగిందని నళినీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.1987 లో ఒక రోజు తన తల్లి తనని గంటా సేపు వదిలి ఏదో పనిమీద బయటకు వెళ్లిపోయిందని.అదే సమయంలో షూటింగ్ కి బ్రేక్ కూడా వచ్చిందని.
అప్పుడే తాను రామరాజన్ తో కలిసి పారిపోయానని నళినీ చెప్పారు.నటిమణి జీవితా రాజశేఖర్ కారు అడిగి ఆమె రామరాజన్ తో కలిసి జంప్ అయ్యానని చెప్పారు.
అయితే తాము ఇంటి నుంచి పారిపోయి ఎవరికీ దొరక్కుండా తిరుగుతున్నప్పుడు తమకు ఎంతో మంది సహాయం చేశారని.ఆమె చెప్పుకొచ్చారు.
అయితే తన భర్త జాతకాలను, వాస్తు లను బాగా నమ్మే వారని.ఆయన అతి నమ్మకాల కారణంగానే తాము 2000 సంవత్సరంలో విడిపోవాల్సి వచ్చింది అని ఆమె చెప్పారు.తన చిన్నతనంలో తెలిసో తెలియకో లేక ఎడ్యుకేషన్ లేకలో తాను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని.ఎవరు కూడా తనలాగా చిన్నతనంలోనే పెళ్లి చేసుకోవద్దని.తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని ఆమె చెబుతున్నారు.ఆమెకు అరుణ, అరుణ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ల పెళ్లిలు కాగా.ఇప్పుడు వాళ్లు సెటిలయ్యారు.
అయితే తమ పిల్లలు సెటిల్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నానని ఆమె చెబుతున్నారు.