ఇటీవల స్పాటీ అనే డాల్మేషియన్ కుక్క సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో బిజినెస్ క్లాస్‌లో (Dalmatian dog, Singapore Airlines, business class)ప్రయాణించి అందరి హృదయాలను గెలుచుకుంది.సింగపూర్ నుంచి టోక్యోకి (Singapore ,Tokyo)5.5 గంటల విమాన ప్రయాణంలో ఈ స్విస్ డాల్మేషియన్(Swiss Dalmatian) చాలా సైలెంట్‌గా తన సీట్లో కూర్చుంది.ఇతర కుక్కల్లాగా కిందకు దిగలేదు.
టాయిలెట్ కి వెళ్తానని మారం చేయలేదు.గాల్లో చాలా ఎత్తులో ఎగురుతున్నా ఏ మాత్రం భయపడలేదు.
స్పాటీ ప్రయాణం మొత్తం ఒక ఇన్‌స్టా వీడియోలో చూపించారు.మొదట అది ప్యాసింజర్ లాంజ్‌లో కనిపించింది, తర్వాత బిజినెస్ క్లాస్ సీట్లో చాలా కంఫర్ట్‌గా కూర్చుంది.ఒకానొక సమయంలో, ఆ కుక్క కెమెరా వైపు చూస్తూ తోక కూడా ఊపింది.“స్పాటీ జపాన్ వెళ్తోంది” అని క్యాప్షన్ కూడా పెట్టారు.
ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యపరిచింది.స్పాటీ ఎంత బాగా ప్రవర్తించిందో అని చాలామంది మెచ్చుకున్నారు.కుక్కను కార్గోలో కాకుండా బిజినెస్ క్లాస్‌లో(business class) ప్రయాణించేందుకు ఎందుకు అనుమతించారని కొందరు ఆశ్చర్యపోయారు.“ఇది బిజినెస్ క్లాస్‌లో ఎలా అనుమతిస్తారు?” అని ఒకరు ప్రశ్నించారు.“సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో కుక్కను ఎలా తీసుకువెళ్లారు? ఇది నిజంగా అనుమతిస్తారా?” అని మరొకరు సందేహం వ్యక్తం చేశారు.
స్పాటీ యజమాని స్పందిస్తూ, స్పాటీ (Spotty)ఒక రిజిస్టర్డ్ సర్వీస్ డాగ్ అని వివరించారు.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ కేవలం పూర్తిగా టీకాలు వేసిన, ప్రభుత్వం ధృవీకరించిన, రిజిస్టర్డ్ సర్వీస్ డాగ్‌లను మాత్రమే క్యాబిన్‌లో అనుమతిస్తుంది అని చెప్పారు.కొన్ని కామెంట్లు సరదాగా కూడా ఉన్నాయి.“స్పాటీ (Spotty)ఏం చూస్తోంది?” అని ఒకరు జోక్ చేశారు.సమాధానం: 101 డాల్మేషియన్స్ సినిమా అట! ఇంకొకరు, “ఒకవేళ దానికి టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తే ఏం చేస్తారు?” అని అడిగారు.
స్పాటీ యజమాని ముందుగానే అన్ని ప్లాన్ చేసుకున్నామని చెప్పారు.అది చాలా ఉదయం ఫ్లైట్ కావడంతో, ల్యాండింగ్‌కు గంట ముందు వరకు స్పాటీకి బ్రేక్‌ఫాస్ట్, నీరు ఇవ్వలేదట.అది బాగా శిక్షణ పొందిన కుక్క కాబట్టి, ల్యాండ్ అయిన తర్వాత సాధారణంగా తిన్నది.ముందు జాగ్రత్త చర్యగా, వారు పీ ప్యాడ్స్ కూడా తీసుకెళ్లారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.