కాలం విడదీస్తుందని అనుకోలేదు.. తారకరత్న భార్య ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

తారకరత్న( Tarakaratna ) రెండేళ్ల క్రితం ఇదే రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే.తారకరత్న మరణం సినీ అభిమానులను ఎంతో బాధ పెట్టింది.

 Tarakaratna Wife Emotional Comments Goes Viral In Social Media Details Inside, T-TeluguStop.com

ఇండస్ట్రీలో అందరివాడిగా గుర్తింపును సొంతం చేసుకున్న తారకరత్న ఊహించని విధంగా గుండె సంబంధిత సమస్యలతో( heart problems ) మృతి చెందారు.తారకరత్న మరణించి రెండేళ్లు కావడంతో అలేఖ్య ఎమోషనల్ అయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

విధి వక్రించి నిన్ను మాకు దూరం చేసిందని నువ్వు లేని లోటును ఈ లోకంలో ఏదీ పూరించదని ఆమె పేర్కొన్నారు.నిన్ను కోల్పోయిన బాధ మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ తగ్గదని అలేఖ్య చెప్పుకొచ్చారు.

మనం ఇలా దూరం అవుతామని ఎప్పుడూ అనుకోలేదని నువ్వు ఇక్కడ మాతో లేకపోవచ్చు కానీ ప్రజెన్స్ మాతో అలాగే ఉందని ఆమె అన్నారు.నువ్వు వదిలివెళ్లిన జ్ఞాపకాలు, కలలు మా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయని అలేఖ్య( Alekhya ) చెప్పుకొచ్చారు.

Telugu Alekhya, Heart Problems, Lokesh, Tarakaratna-Movie

నీపై ఎప్పటికీ తగ్గని ప్రేమతో మాటలకు మించి, కాలాన్ని దాటి, జీవితానికి మించి మిమ్మల్ని మిస్‌ అవుతున్నామని ఆమె కామెంట్లు చేశారు.మరోవైపు నారా లోకేశ్ సైతం మీరు మా నుంచి దూరమైనా మీ జ్ఞాపకాలు మా మనసులో పదిలంగా ఉన్నాయని కామెంట్లు చేశారు.మీరు మాపై చూపించిన ప్రేమ, అనురాగం శాశ్వతంగా నిలిచి ఉంటాయని చెప్పుకొచ్చారు.

Telugu Alekhya, Heart Problems, Lokesh, Tarakaratna-Movie

మీ జ్ఞాపకాలు చిరస్మరణీయమని మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని నారా లోకేశ్ ( Nara Lokesh )వెల్లడించారు.మా బావ నందమూరి తారకరత్న రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని నారా లోకేశ్ పోస్ట్ చేశారు.అలేఖ్యకు నెటిజన్లు మనో ధైర్యం చెప్పడంతో పాటు ఆత్మకు శాంతి కలగాలని వెల్లడిస్తున్నారు.

అలేఖ్య చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube