ఆహారం విషయంలో కొన్నిసార్లు మనం పనికిరానివి అనుకున్న వాటిలోనే పోషకాలు అధికంగా ఉంటాయి.అలాంటి వాటిలోనే చింతచిగురు ఒకటి.
నిజానికి ఎండాకాలంలో గ్రామాల్లో చింతలు కొడుతూ ఉంటారు.వాటితో చింతపండు ( Tamarind )తయారు చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు.
అయితే ఇక్కడ అందరికీ చింతపండు వినియోగం గురించి తెలుసు కానీ, చింతచిగురు గురించి చాలామందికి తెలిసి ఉండదు.ఈరోజు చింతచిగురు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు కంటే చింతచిగురు తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.దీనిని ఆహారంలో కలిపి తీసుకుంటే శరీరానికి డైట్ ఫ్రీ ఫైబర్( Diet free fiber) పుష్కలంగా లభిస్తుంది.

అయితే చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ నీ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.చింతచిగురుని ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి( Sore Throat ), మంట, వాపు తగ్గుతుంది.అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చింతచిగురులో పుష్కలంగా ఉండడం దీనికి కారణమని చెప్పవచ్చు.
అయితే చింతపండును తినడం వలన కడుపులో నులిపురుగుల సమస్య ఉంటే కూడా వెంటనే ఆ సమస్య నుండి బయటపడవచ్చు.చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపించడం వలన నులిపురుగుల సమస్య నుండి కూడా ఉపశమనం ఉంటుంది.

జీర్ణాశయ సంబంధ సమస్య( Digestive Disorders)లను తొలగించడంలో చింతచిగురు కూడా బాగా పనిచేస్తుంది.చింతచిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.అయితే తరచూ చింత చిగురు తింటే ఎముకలు గట్టి పడతాయి.థైరాయిడ్ తో బాధపడేవారు కూడా చింతచిగురు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అయితే గుండె జబ్బులకు చింత చిగురు ఔషధంలా పనిచేస్తుంది.
అలాగే శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కూడా అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.