టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్( Sundeep Kishan ) గురించి మనందరికీ తెలిసిందే.సందీప్ కిషన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు అయినప్పటికీ సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా పడలేదు అని చెప్పాలి.
ఏమో ఒకటి రెండు సినిమాలు మెప్పించినప్పటికీ అవి సందీప్ కేరిర్ కు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి.ఇకపోతే సందీప్ కిషన్ ప్రస్తుతం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే సందీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా.( Mazaka ) త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు సందీప్.

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.తాను ఒక వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపాడు.తాను సైనస్ తో( Sinus ) బాధపడుతున్నట్టు తెలుపుతూ అభిమానులకు షాక్ ఇచ్చారు.
సినిమా షూటింగ్ లో గ్యాప్ లో కార్ వ్యాన్ లోకి వెళ్లి నిద్రపోతాను అని చెప్పాడు.పడుకున్న తర్వాత నా ముక్కునుంచి తన వెనక భాగం వరకు బ్లాక్ అవుతుందని తెలిపాడు.
అలాగే ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను.మా అమ్మా నాన్నతో కూడా నేను మాట్లాడను ఉదయాన్నే వేడిగా టీ తాగి, మెడిటేషన్ మ్యూజిక్, స్తోత్రాలు విని ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పాడు.

అలాగే దీని కోసం సర్జరీ చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవడం లేదు అని సందీప్ తెలిపాడు.అలాగే నెల రోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి.ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాలి.అందుకే నాకు భయం అని సందీప్ చెప్పుకొచ్చాడు.ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో అభిమానులు సందీప్ బాగుండాలని ఎలాంటి సమస్యలు ఉండకూడదని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.