సునీతా విలియమ్స్( Sunita Williams ) అంతరిక్ష సాహసాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పాపులరయ్యారు.భారత సంతతికి చెందిన ఈ మహిళా వ్యోమగామి నాసాలో( NASA ) టాప్ మోస్ట్ ఆస్ట్రోనాట్లలో ఒకరు.
ఆమె ఇప్పటికే 300 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు.అంతరిక్ష పరిశోధనలకు ఆమె చేసిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
అయితే, అంతరిక్షంలో( Space ) ఇంతకాలం పనిచేసినందుకు సునీతా విలియమ్స్ జీతం ఎంత ఉంటుందో చాలా మందికి తెలియదు.మీ అందరి డౌట్ క్లియర్ చేస్తూ, ఆమె సంపాదన, బెనిఫిట్స్, బాధ్యతల గురించి ఇక్కడ క్లియర్ గా చూద్దాం.
అమెరికా ప్రభుత్వం రూపొందించిన జనరల్ షెడ్యూల్ (GS) పే స్కేల్ ప్రకారమే నాసా వ్యోమగాములకు జీతాలు చెల్లిస్తుంది.అనుభవం, ర్యాంక్ ఆధారంగా వారి శాలరీ ఉంటుంది.వ్యోమగాములను GS-13, GS-14, GS-15 అనే మూడు స్థాయిలుగా విభజిస్తారు.

GS-13 (ఎంట్రీ-లెవెల్):
కొత్తగా చేరిన వ్యోమగాములు సంవత్సరానికి 81,216 డాలర్లు (సుమారు రూ.70.32 లక్షలు) నుండి 105,579 డాలర్లు (సుమారు రూ.91.41 లక్షలు) వరకు సంపాదిస్తారు.
GS-14 (ఎక్స్‌పీరియన్స్డ్):
కొంచెం అనుభవం ఉన్నవాళ్లు సంవత్సరానికి 95,973 డాలర్లు (సుమారు రూ.83.09 లక్షలు) నుంచి 124,764 డాలర్లు (సుమారు రూ.1.08 కోట్లు) వరకు సంపాదిస్తారు.
GS-15 (సీనియర్ లెవెల్):
బాగా సీనియర్ వ్యోమగాములు సంవత్సరానికి గరిష్టంగా 146,757 డాలర్లు (సుమారు రూ.1.27 కోట్లు) వరకు సంపాదించగలరు.
సునీతా విలియమ్స్ ప్రస్తుతం ఒక పెద్ద అంతరిక్ష యాత్రలో ఉన్నారు.ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో( Boeing Starliner ) తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో( Astronaut Butch Wilmore ) కలిసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఎక్స్‌పెడిషన్ 71/72 మిషన్‌లో వీరు జాయిన్ అయ్యారు.అందిన సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది మార్చి 12న స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా ఆమె భూమికి తిరిగి రానున్నారు.
అంటే దాదాపు 9 నెలలు ఆమె అంతరిక్షంలోనే ఉంటారు.

జీతంతో పాటు, నాసా వ్యోమగాములకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.అవేంటో చూస్తే షాక్ అవుతారు.అంతరిక్ష ప్రయాణంలో ఉండే రిస్క్‌లను దృష్టిలో పెట్టుకుని వ్యోమగాములకు ఫుల్ మెడికల్ కవరేజ్ ఉంటుంది.
ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా నాసా చూసుకుంటుంది.రాకెట్ సైన్స్ అంటే మాటలు కాదు, అందుకే వ్యోమగాములకు సిమ్యులేషన్స్, టెక్నికల్ స్కిల్స్ నేర్పించడం వంటి ఎన్నో రకాల ట్రైనింగ్‌లు ఇస్తారు.
వ్యోమగాములు, వారి కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కోసం నాసా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.మిషన్ ముందు, సమయంలో, తర్వాత కూడా సైకలాజికల్ సపోర్ట్ ఇస్తారు.సింబాలిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో పాటు, వ్యోమగాములకు ట్రావెల్ అలవెన్సులు కూడా ఇస్తారు.ఆర్ధికంగా భరోసా కోసం నాసా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.
అంతరిక్ష యాత్రలు అంటే సామాన్యమైన విషయం కాదు.ఇలాంటి సాహసాలు చేసే వ్యోమగాములకు మనం సెల్యూట్ చేయాల్సిందే.







