కొందరు చైల్డ్ ఆర్టిస్ట్ తమ నటనా ప్రతిభతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటారు కానీ పెరిగి పెద్దయిన తర్వాత హీరోగా గానీ హీరోయిన్ గా గానీ రాణించలేరు.దీనికి కారణం బాల్య నటీనటులకు సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడమో లేక వారికి నటనా పై కాలక్రమేణా ఆసక్తి తగ్గిపోవడమో అయ్యి ఉంటుంది.
అయితే ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో ఇద్దరు బాలనటులు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఆ తరువాత వెండితెరకు దూరమయ్యారు.వారెవరో.
వారు ఎందుకు సినిమాలకు దూరమయ్యారో ఈ ఆర్టికల్ వివరంగా తెలుసుకుందాం.
అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా హీరోహీరోయిన్లుగా నటించిన బొంబాయి సినిమా 19 92 లో విడుదలై సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన సంగతి విధితమే.ముంబై అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యొక్క చిత్రీకరణ మొత్తాన్ని బొంబాయి మహానగరంలోనే జరపాలని మణిరత్నం భావించారు.
కానీ అప్పట్లో బొంబాయిలో పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో ఆయన తన ఆలోచనను విరమించుకున్నారు.కొన్ని కీలక సన్నివేశాలను మాత్రం బొంబాయి మహానగరంలోనే చిత్రీకరించారు.ఇక మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించడానికి బొంబాయి మహానగరాన్ని పోలిన కొన్ని సెట్స్ ని మద్రాస్ లో నిర్మించి సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు.
అయితే ఈ సినిమాలో అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా తో పాటు కవలపిల్లలు గా నటించిన ఇద్దరూ బాల్య నటులు కూడా బాగా హైలెట్ అయ్యారు.వారు ఎవరంటే. కబీర్ నారాయణ్ పాత్రలో నటించిన మాస్టర్ హర్ష.
కమల్ బషీర్ పాత్రలో నటించిన మాస్టర్ హృదయ్.అయితే ఈ ఇద్దరినీ సెలెక్ట్ చేయడానికి మణిరత్నం దాదాపు 100 మంది కవల పిల్లలను చూశారు కానీ ఏ ఒక్కరూ కూడా అతనికి నచ్చలేదు.
ఆ సమయంలోనే మణిరత్నం వద్ద దర్శకత్వ శాఖలో పని చేసే ఫణి అనే ఒక వ్యక్తి.జంధ్యాల సమీప బంధువులైన మాస్టర్ హర్ష, మాస్టర్ హృదయ్ లను మణిరత్నానికి పరిచయం చేశారు.
అయితే ఆ చిన్న పిల్లలు ఇద్దరు కూడా కవల పిల్లలు కావడంతో తన సినిమాకి బాగా సూట్ అవుతారని మణిరత్నం అనుకున్నారు.వెంటనే వారి ఫోటోలను తీసి బాగా పరిశీలించి వాళ్లనే ఫైనలైజ్ చేశారు.
అయితే నిజానికి వీళ్లిద్దరూ కూడా మన తెలుగు గడ్డ మీద జన్మించిన వారే.వీరి అసలు పూర్తి పేర్లు హర్ష ఎర్లప్రగడ, హృదయ్ ఎర్లప్రగడ.అయితే హృదయ్ బొంబాయి సినిమా తర్వాత వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో నటించి మెప్పించారు.అయితే ఉన్నత చదువులు చదవడానికి ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంజనీరింగ్ పూర్తి చేశారు.ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకొని తకిటతకిట ఫేమ్ అతిధి చెంగప్ప తో కలసి కొంజం కాఫీ కొంజం కాదల్ సినిమాలో హీరో గా నటించారు.2012వ సంవత్సరంలో విడుదలయిన ఈ సినిమా అంతంత మాత్రమే ఆడింది.2014 లో పానివిజుం నీలావు సినిమాలో మళ్లీ హీరోగా కనిపించారు కానీ ఆయనకు అంతగా గుర్తింపు దక్కలేదు.దీంతో ఆయన సినిమాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పి అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నారు.
తాను సినిమాల్లో రాణించకపోవడానికి ముఖ్య కారణం ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకపోవడమేనని హృదయ్ చెబుతుంటారు.కాగా.హర్ష మాత్రం సినిమాలపై తనకు అసలు ఇష్టమే లేదని చెబుతుంటారు.ప్రస్తుతం ఈయన అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు.