నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి మనందరికీ తెలిసిందే.ఆయన ముక్కుసూటి మనిషి అన్న విషయం కూడా తెలిసిందే.
ఏ విషయాన్ని అయినా సరే కుండబద్దలు కొట్టినట్టుగా ముఖం మీద మాట్లాడిస్తూ ఉంటారు.సినిమాల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పాలి.
సినిమా షూటింగ్లో ఎంతో సరదాగా ఉంటూ అందరితో బాగా కలిసిపోయే బాలయ్య బాబు ఒకసారి కెమెరా ముందుకు రాగానే అవన్నీ పక్కన పెట్టేసి పాత్రలో మునిగిపోతూ ఉంటారు.అలాగే ఒకటి చెప్పి ఒకటి చేస్తాం అంటే నందమూరి బాలయ్యకు అస్సలు నచ్చదు.

ముందుగా చెప్పినప్పుడే క్లారిటీగా చెప్పేయాలి.ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తాను అంటే బాలయ్య దగ్గర కుదరదు.ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా, బోయపాటి( Boyapati ) అఖండ 2( Akhanda 2 ) సినిమాకు సంబంధించి వినిపిస్తున్న వ్యవహారాలు అన్ని వింటుంటే ఇవన్నీ చెప్పాల్సి వస్తోందని చెప్పాలి.అఖండ 2 సినిమాలో ప్రగ్య జైస్వాల్( Pragya Jaiswal ) ఉండాలి.
తొలి భాగంలో ఆమె వుంది.అందువల్ల మలి భాగంలో తప్పని సరి.కానీ ఆమె చాలా ఎక్కువ రెమ్యూనిరేషన్ అడిగినట్లు తెలుస్తోంది.బేరం తెగలేదు.
దాంతో డైరక్టర్ బోయపాటి అసలు ఆమె పాత్ర ఎందుకు అని, చనిపోయినట్లు కథ మార్చేసారు.సినిమాలో మరో పాత్రను క్రియేట్ చేసి సంయుక్త మీనన్ ను( Samyuktha Menon ) తీసుకున్నారట.
అయితే ప్రగ్య జైస్వాల్ పాత్ర చనిపోయిన సీన్ ఒకటి తీయాలి కదా.

అది తీస్తున్నపుడు బాలయ్య సీన్, సెట్ అంతా చూసి, యూనిట్ ను చెడా మడా ఏకి పారేసినట్లు తెలుస్తోంది.ఏం మిస్ అయిందో తెలుసునా అంటూ ప్రశ్నించి, వారంతా తెల్ల మొహం వేసాక అప్పుడు చెప్పారట.చనిపోయిన సీన్ తీస్తున్నారు కదా, మరి చనిపోయిన మనిషి ఫోటో ఎక్కడ అని.ప్రగ్య జైస్వాల్ ఫోటో వాడడం ఇష్ఠం లేని బోయపాటి సీన్ లో ఫొటో పెట్టలేదట.బాలయ్య సీన్ కు అది అవసరం అని గుర్తు చేసి, తన స్టయిల్ లో నాలుగు తిట్లు తిట్టి, ఫొటో తెప్పించి పెట్టారట.
ఇదిలా వుంటే సినిమా ఆరంభంలో సంజయ్ దత్ ను సినిమాలో కీలక పాత్రకు తీసుకుంటున్నాం అని చెప్పారట.కానీ తరువాత ఎందుకో మళ్లీ బోయపాటి మనసు మార్చుకున్నారు.
కానీ బాలయ్య దగ్గర అలా కుదరదు కదా.బోయపాటిని పిలిచి నిలదీసినట్లు తెలుస్తోంది.డేట్ లు అవీ ఇవీ అని నీళ్లు నములుతుంటే, తానే ఫోన్ తీసుకుని సంజయ్ దత్ తో మాట్లాడి ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ విషయాలు అన్నింటి పైకి క్లారిటీ రావాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.







