యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోయిన్ శ్రీలీల( Heroine Sreeleela ) ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండగా, మరోవైపు సోషల్ మీడియాలోనూ అదిరిపోయే ఫోటోలు, వీడియోలతో సందడి చేస్తుంది.తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్( Viral Video ) అవుతోంది.
ఈ వీడియోలో శ్రీలీల కారం పొడి, వేడన్నం తింటూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.ఈ ఫుడ్ కోసం ఉదయం నుంచి ఏమీ తినకుండా వెయిట్ చేసింది అని చెప్పడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు “సో క్యూట్!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
శ్రీలీల ప్రస్తుతం నితిన్ సరసన ‘రాబిన్ హుడ్’ సినిమాలో( Robinhood Movie ) నటిస్తోంది.వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కానుంది.ఇకపోతే తాజాగా విడుదలైన ‘Wherever You Go’ లిరికల్ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వినూత్నంగా బ్రాండ్ పేర్లతో రాసిన ఈ పాట కేవలం 5 రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.ఇందులో నితిన్, శ్రీలీల డాన్స్ మూవ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు, ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’( Ustaad Bhagat Singh ) లో కూడా శ్రీలీల నటిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి.తెలుగులో స్టార్ స్టేటస్ దక్కించుకున్న శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది.ఆమె హిందీలో నటిస్తున్న ఫస్ట్ ఫిల్మ్ టీజర్ ఇటీవలే విడుదలైంది.
ఈ సినిమా కార్తిక్ ఆర్యన్ సరసన రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోంది.అయితే, సినిమా టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు.
అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది.టాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా దూసుకుపోతూ.
బాలీవుడ్ ఎంట్రీతో తన రేంజ్ పెంచుకుంటున్న శ్రీలీల.ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.