సల్మాన్ ఖాన్ , ఏఆర్ మురుగదాస్( Salman Khan, AR Murugadoss ) కాంబినేషన్ లో రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన సికిందర్ మూవీ ( Sikander Movie )తాజాగా విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.రంజాన్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కాగా కథ, కథనం ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవని కామెంట్లు వినిపించాయి.
రష్మిక కూడా ఈ సినిమాకు మైనస్ కాగా సల్మాన్ ఖాన్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరచగా సినిమా కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.
సినిమా రిలీజ్ కు ముందే హెచ్డీ ప్రింట్ లీక్ కావడం కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది.సికిందర్ మూవీ తొలిరోజు కలెక్షన్లు కేవలం 26 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
సల్మాన్ ఖాన్ రేంజ్ కు ఈ కలెక్షన్లు తక్కువ మొత్తం అనే చెప్పాలి.

ఏఆర్ మురుగదాస్ కు ఇప్పట్లో కొత్త మూవీ ఆఫర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి రోజురోజుకు దారుణం అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సికిందర్ మూవీ సౌత్ లో నామమాత్రపు కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో సైతం ఫెయిల్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ కెరీర్ ప్రమాదంలో పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ వయస్సు ప్రస్తుతం 59 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.సల్మాన్ ఖాన్ రొటీన్ సినిమాలలో నటించడం వల్ల ఆయన కెరీర్ కు నష్టమే తప్ప లాభం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సల్మాన్ ఖాన్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
సల్మాన్ రేంజ్ రాబోయే రోజుల్లో పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి.బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి రోజురోజుకు దారుణంగా అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.