యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలతో తమకంటూ భారీ హైప్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.
చాలామంది హీరోలు విపరీతమైన సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు పాన్ ఇండియాలో మంచి గుర్తింపైతే ఉంది.
తమిళ్ సినిమా ఇండస్ట్రీ(Tamil film industry) నుంచి వస్తున్న హీరోలు వరుస సినిమాలు చేస్తున్నప్పటికి వాళ్లకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు.దాంతో వాళ్లు కొంతవరకు వెనుకబడి పోతున్నారనే చెప్పాలి.
మరి ఇకమీదటైనా వాళ్ళు చేయబోయే సినిమాలతో మంచి విజయాలను అందుకొని తమకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలి.
రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, విజయ్ (Rajinikanth, Kamal Haasan, Suriya, Vikram, Vijay)లాంటి హీరోలు ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ లు మాత్రం సాధించలేకపోతున్నాయి.

దానివల్లే వాళ్ళు భారీగా వెనుకబడి పోతున్నారు మరి ఇలాంటి క్రమంలోనే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.ఒకప్పుడు స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న వీళ్ళందరూ తెలుగులో సైతం భారీ విజయాలను అందుకున్నారు.కానీ ఇప్పుడు పాన్ ఇండియాలో మాత్రం వాళ్ళ మ్యాజిక్ రిపీట్ చేయడానికి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులను మించి వీళ్ళు భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంది…