ఆరోగ్యవంతమైన మసాలా ద్రవ్యాల్లో ఏలకులు( Cardamoms ) ఒకటి.క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలవబడే ఏలకులు ఏ వంటకానికైనా అద్భుతమైన రుచి, సుగంధం తెచ్చిపెడతాయి.
ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను అందిస్తాయి.అంతేకాదండోయ్.
ఏలకులతో ఎన్నో అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.అవును, ఏలకులు ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయి.
వివిధ చర్మ సంబంధిత సమస్యలకు సమర్థవంతంగా చెక్ పెడతాయి.అసలు ఏలకులతో ఎటువంటి బ్యూటీ బెనిఫిట్స్ పొందొచ్చు.? వాటిని చర్మానికి ఎలా ఉపయోగించాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మాన్ని బ్రైట్ గా మరియు సాఫ్ట్‌గా మార్చడంతో ఏలకులు తోడ్పడతాయి.అందుకోసం వన్ టీ స్పూన్ ఏలకుల పొడిలో అర టీ స్పూన్ తేనె ( honey )మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని మసాజ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.మృదువుగా తయారవుతుంది.డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.

ఏలకులతో టోనర్ ను తయారు చేసుకుని రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు.అందుకోసం ఒక గ్లాస్ వాటర్ లో ఏడు నుంచి ఎనిమిది దంచిన ఏలకులు వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.ఆపై మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టి ఒక స్ప్రే బాటిల్ లో పోసి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి.
రోజుకు రెండుసార్లు ఈ టోనర్ ను కనుక ఉపయోగిస్తే చర్మం క్లీన్ గా మారుతుంది.మురికి, బ్యాక్టీరియా తొలగిపోతాయి.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.స్కిన్ ఏజింగ్ ఆలస్యమవుతుంది.
మొటిమలు, మచ్చలు దూరం అవుతాయి.క్లియర్ అండ్ హెల్తీ స్కిన్ మీ సొంతం అవుతుంది.







