కాళ్ళ తిమ్మిర్లు.ఎప్పుడో ఒక సారి వస్తే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు.
కానీ, కొందరు తరచూ ఈ కాళ్ళ తిమ్మిర్లతో తీవ్రంగా ఇబ్బందికి గురి అవుతుంటారు.జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, కిడ్నీ వ్యాధులు, థైరాయిడ్, శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం, ప్రెగ్నెన్సీ, పోషకాల కొరత ఇలా రకరకాల కారణాల వల్ల తరచూ కాళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా మారుతుంటాయి.
ఆ సమయంలో చాలా బాధగానూ, అసౌకర్యంగానూ ఉంటుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను సులభంగా నివారించుకోవచ్చు.
మరి ఆ జాగ్రత్తలు ఏంటో చూసేయండి.
మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, విటమిన్ బి వంటి పోషకాల కొరత ఏర్పడినప్పుడు కాళ్ళ తిమ్మిర్ల సమస్య అత్యధికంగా ఉంటుంది.
అందు వల్ల, డైట్‌లో ఆయా పోషకాలు ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.

శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల కూడా కాళ్ళ తిమ్మిర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ప్రతి రోజూ 12 గ్లాసుల వాటర్‌ను తీసుకోవాలి.తద్వారా బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
తిమ్మిర్ల సమస్య దరి చేరకుండా ఉంటుంది.
అలాగే ప్రతి రోజు కనీసం ఇరవై నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి.
రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటివి రెగ్యులర్‌గా చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.దాంతో కాళ్ళ తిమ్మిర్ల సమస్య తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.

ఎక్కువ బిగుతుగా ఉండే షూ లేదా చెప్పులు ధరించినా నరాలు ఒత్తిడికి గురై తిమ్మిర్లు పుడతాయి.కాబట్టి, కాస్త లూజ్‌గా, సౌకర్యంగా ఉండే షు లేదా చెప్పులను వేసుకోండి,
ఒకే చోట గంటలు తరబడి కూర్చోవడం లేదా నిలబడటం చేసినా కాళ్ళ తిమ్మిర్ల సమస్య వేధిస్తూ ఉంటుంది.కాబట్టి, మీరు గంటలు తరబడి కూర్చున్నా లేదా నిలబడి వర్క్ చేసినా మధ్య మధ్యలో మాత్రం కాస్త గ్యాప్ తీసుకుంటూ ఉండండి.
!