జంక్ ఫుడ్ తిన్నా వెయిట్ పెర‌గ‌కూడ‌దా..అయితే ఇలా చేయండి!

రుచిగా ఉండ‌టం వ‌ల్ల పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది జంక్ ఫుడ్‌కు అల‌వాటు పడిపోతారు.మంచి రుచి క‌లిగి ఉండే జంక్ ఫుడ్‌లో పనికొచ్చే పోషకాలేవీ ఉండ‌క పోగా శ‌రీరానికి హాని చేసే ఉప్పు, చక్కెర, కొవ్వులు వంటివి మాత్రం మితిమీరి ఉంటాయి.

 These Tips To Avoid Over Weight Even After Eating Junk Food! Junk Food, Effects-TeluguStop.com

అందుకే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాల‌ని నిపుణులు చెబుతారు.ఇక ఆరోగ్యానికి మంచిది కాదు, బ‌రువు పెరిగిపోతాం అని తెలిసినా జంక్ ఫుడ్‌ను విడిచి పెట్ట‌లేక‌పోతారు.

అందుకు కార‌ణంగా వాటికి బాగా అల‌వాటు ప‌డిపోవ‌డ‌మే.

అయితే జంక్ ఫుడ్ తిన్నా వెయిట్ పెర‌గ‌కుండా ఆరోగ్యంగా ఉండాలీ అంటే ఖ‌చ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.జంక్ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల మొద‌ట జ‌రిగితే శ‌రీరంలో కేల‌రీలు పెరిగిపోవ‌డం.

ఈ కేల‌రీలు స్థూలకాయం, గుండె జ‌బ్బులు, మధుమేహం వంటి స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడ‌తాయి.అందుకే జంక్ ఫుడ్ తినే వారు ప్ర‌తి రోజు అర గంట నుంచి గంట పాటు వాకింగ్‌, రన్నింగ్‌, స్కిప్పింగ్ ఇలా వ్యాయామాలు చేసి కేల‌రీల‌ను క‌రిగించుకోవాలి.

జంక్ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్య‌ర్థాలు ఎక్కువ‌గా పేరుకు పోతాయి.వీటిని బ‌య‌ట‌కు పంపాలంటే రెగ్యుల‌ర్ హోమ్ మేడ్ డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలి.

డిటాక్స్ డ్రింక్స్ బాడీలో వ్య‌ర్థాలను, విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపి శరీర వ్యవస్థను శుభ్రపరుస్తాయి.

Telugu Effects Junk, Tips, Junk, Latest-Telugu Health - తెలుగు హ

జంక్ ఫుడ్ తినే వారు ప్ర‌తి రోజు ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.గ్రీన్ టీ బ‌రువును త‌గ్గించ‌డ‌మే కాదు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని పెంచ‌డంలోనూ, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరును మెరుగు ప‌ర‌చ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అలాగే డైట్‌లో తాజా పండ్లు, ఆకుకూర‌లు, చిక్కుళ్ళు, విత్తనాలు, న‌ట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఉండేలా చూసుకోవాలి.

మ‌రియు మంచిగా నిద్ర‌పోవాలి.

అయితే ఒక‌టి గుర్తు పెట్టుకోండి పైన చెప్పిన టిప్స్ పాటిస్తున్నాం.

ఎంత కావాలంటే అంత‌ జంక్ ఫుడ్‌ను లాంగించేయ‌వ‌చ్చు అని అనుకుంటే రిస్క్‌లో ప‌డ‌తారు.ఎందుకంటే జంక్ ఫుడ్‌ను మితంగా తీసుకుని పైన చెప్పుకున్న టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండొచ్చు.

అలాకుండా ఎంత ప‌డితే అంత‌, ఎలా ప‌డితే అలా జంక్ ఫుడ్ తింటే ఎన్ని చేసినా ఫ‌లితం ఉండ‌దు.జాగ్ర‌త్త‌!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube