ఆయుర్వేద శాస్త్రంలో వెల్లుల్లికి ( Garlic ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెతను పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు.
అంటే వెల్లుల్లిలో అన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.వెల్లుల్లి నీ క్రమ పద్ధతిలో తీసుకుంటే చాలా రకాల ప్రాణాంతక వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
వెల్లుల్లిని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ప్రతి వంట గదిలో వెల్లుల్లి తప్పకుండా ఉంటుంది.
కూరలలో, తాలింపుల్లో ఇతర వంటకాలలో వీటిని తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు.ఇవి వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
వెల్లుల్లి వేడు చేస్తుంది కాబట్టి వీటిని పరిమితికి మించి తీసుకోకూడదు.ఇందులో న్యూట్రియంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
రోగ నిరోధక శక్తి( Immunity Power ) పెంచడంతో పాటు చాలా రకాల అంటూ వ్యాధులను ఇది తగ్గిస్తుంది.

అయితే వెల్లుల్లితో ఈ ప్రయోజనాలు పొందాలంటే రోజు క్రమం తప్పకుండ ఉదయం ఒకటి లేదా రెండు తీసుకుంటే చాలు.వెల్లుల్లి రెమ్మలు రోజు తీసుకుంటే మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి.వెల్లుల్లితో డిప్రెషన్ దూరమై మానసిక ఆరోగ్యం( Mental Health ) కలుగుతుంది.
వెల్లుల్లినీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది.వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ అనే కాంపౌండ్ ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే వెల్లుల్లిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ ను కూడా దూరం చేస్తాయి.అయితే ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒకటి లేదా రెండు రెమ్మలను తినవలసి ఉంటుంది.వెల్లుల్లి బరువు తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.ప్రతిరోజు ఉదయం పరిగడుపున పచ్చి వెల్లుల్లి తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.