సూర్యాపేట జిల్లా
:జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాల,జూనియర్ కళాశాల( Narayana educational institutions ) యాజమాన్యం నూతన నయాదందాకు తెరలేపారు.ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని తమ స్కూల్, జూనియర్ కాలేజీకి( school, Jr Collages ) అడ్మిషన్లు తీసుకురా వాలని,ఆఫర్లు తెచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత డబ్బు ఇస్తున్నారని సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులకు( Govt Job Parents ) చెబితే వారు నమ్మి తమ పిల్లలను పాఠశాల,జూనియర్ కళాశాలలో జాయిన్ చేస్తే దండిగా ఫీజులు వసూలు చేయవచ్చునని ఈ కొత్త తరహా దందాకు నారాయణ స్కూల్, కళాశాల యాజమాన్యం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.అయితే
ఇప్పటికే నారాయణ యాజమాన్యం ఆ విధంగా పూర్తిస్థాయిలో అడ్మిషన్లు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అడ్మిషన్ తేదీలను అకాడమీ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వమే స్వయంగా ప్రకటిస్తుంది.సర్కార్ ప్రకటించిన తేదీ నుంచి ప్రభుత్వం,ప్రైవేటు జూనియర్ కళాశాలలు, విద్యార్థు…
.