పూర్వం కాలం లో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు, వాటి వల్ల ఆరోగ్యముగా ఉండేవాళ్లు.వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికి మనం పాటిస్తున్నాం.
అవి సైంటిఫిక్ గా కూడా మనకి ప్రయోజనం చేస్తాయని ప్రూవ్ అయింది.అయితే మహిళలు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని చెప్పారు , ఆడవాళ్లు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకోడదో చూడండి.పైన చెప్పుకున్న విధంగా ఇంటికి ఇబ్బందిని కలిగించే ఆ పనులు చేయకూడదు మరియు మీకు శుభాన్ని కలిగించే ఈ పనులను తప్పక చేయాలి.ఇలా చేయాలా వద్దా అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టం.
మహిళలు ఉదయాన్నే చేయకూడని పనులు :
మహిళలే ఈ పనులు ఉదయం చేయకూడదా అని అనుకోకండి.ఇక్కడ చెప్పుకునే కొన్ని విషయాలు మగవారికి కూడా వర్తిస్తాయి.అవేంటో ఇక్కడ చూసేద్దాం.
1.మహిళలు ఉదయాన్నే జుట్టు విరబూసుకుని ఇంట్లో అటూఇటూ తిరగడం చేయకూడదు.
2.ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి.
3.ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు.ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు.
4.మీకు భయం కలిగించే ఫొటోలు, భయాన్ని కలిగించే జంతువుల ఫోటోలు చూడకూడదు.
ఉదయాన్నే నిద్రలేచాక చేయాల్సిన పనులు :
1.ఉదయం నిద్రలేచిన వెంటనే ఏం చేయకూడదో చెప్పారు, మరి నిద్రలేచిన వెంటనే ఏం చేయాలో కూడా చెప్పండి అని మీరు అడగకముందే వివరంగా మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.అవేంటో తెలుసుకోండి.
2.ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి.
3.మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది.
4.ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని, మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు.5.ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి.పసి పిల్లలు హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి.
6.పెళ్లి చేసుకున్నవారు మాత్రం ఇల్లాలు ముఖం మొదటిగా చూడామని చెబుతున్నారు.