తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది సూర్య( Suriya ) అనే చెప్పాలి.రజినీకాంత్, కమల్ హాసన్ ల తర్వాత అంత గొప్ప పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకొని తమిళ్ తో పాటు తెలుగులో కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం అయితే ఉంటుంది.
మరి ఆ కథాంశానికి తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కించి భారీ గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి తను చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు.తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్న రెట్రో సినిమా( Retro Movie ) మే ఒకటోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి ఏర్పాటు అవుతుందా? పాన్ ఇండియాలో ఆయన స్టార్ హీరోగా వెలుగొందుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

గత సంవత్సరం వచ్చిన కంగువా( Kanguva ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.దాంతో ఆయన మార్కెట్ అనేది భారీగా పడిపోయింది మరి రెట్రో సినిమాతో ఆయన మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా? పాన్ ఇండియాలో గుర్తింపును ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమిళ్ సినిమా ఇండస్ట్రీ చాలా వరకు వెనుకబడిపోతుందనే చెప్పాలి.ఒకప్పుడు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసిన వాళ్లు ఇప్పుడు మాత్రం సక్సెస్ లను సాధించడంలో చాలా వెనుకబడి పోతున్నారు.
పాన్ ఇండియాలో ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేక డీలా పడిపోతున్నారు…
.