దుర్గ గుడిలో నల్లగా మారుతున్న కలశాలు.. అసలు ఏం జరుగుతుంది..?

కృష్ణా నది (Krishna river )తీరంలోని విజయవాడ( Vijayawada )లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ గుడి కొలువైంది.ఆమెను దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు.

 Golden Urns Turning Black In Kanaka Durga Temple What Happens ,krishna Riv-TeluguStop.com

అలానే ఈ అమ్మవారికి ఆలయంలో చేసిన ప్రతిదీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు.ఇక అందరికి ఇంద్రకీలాద్రి అనగానే మనకు గుర్తు వచ్చేది రాజా గోపురం.

ఈ గోపురానికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నివారించారు.నాటితే దుర్గ గుడిలో జరుగుతున్న ఓ పరిమాణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అదేంటంటే గోపురంపై ఉన్న బంగారు కలశాలు నల్లగా మారిపోతున్నాయి.

అసలు దుర్గ గుడిలోని ఈ రాజగోపురం ఏనిమిదెళ్ళ క్రితం ఏర్పాటు చేశారు.అలానే ఈ గోపురం పైన భారీ కలశాలను కూడా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో భక్తుల నుండి కూడా పెద్ద సంఖ్యలో విరాళాలు సేకరించడం జరిగింది.ఆ విరాళాల నుండి వచ్చిన డబ్బులతో ఈ కలశాలను గోపురంపై ప్రతిష్టించారు.

అయితే ఇవి ఏర్పాటు చేసి 8 ఏళ్లు అయింది.అప్పుడే వాటి రంగు మారిపోవడం ఏంటి అంటూ ఎన్నో విమర్శలు వస్తున్నాయి.

ఇక మరి ముఖ్యంగా ఇటీవల దుర్గాదేవి గుడిలో వస్తున్న వార్తలతో అసలు ఏం జరుగుతుందని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ క్రమంలోనే రాజగోపురం పై ఉండే బంగారు కలశాలు నల్లగా మారుతున్నాయని తెలిసింది.ఇంద్రకీలాద్రి( Indrakeeladri )పై దుర్గం గుడిలో వెళ్లే ప్రధాన ఆలయం వైపున ఉన్న ప్రవేశం మార్గం దగ్గర ఉన్న ఒక గోపురం పై రెండు దశాబ్దాల క్రితం కలశాలు ఏర్పాటు చేశారు.అయినప్పటికీ ఆ కలశాలు బంగారు వర్ణంతోనే విరాజిల్లుతుంది.

అలాగే దుర్గగుడి ప్రధాన ఆలయం ఘాటు రోడ్డు వైపు ఉన్న ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కలశాలు మాత్రం రెండు దశాబ్దాలు అవుతున్న చెక్క చెదరనే లేదు.మరి రాజగోపురం పై కలశాలు ఏర్పాటు చేసి దశాబ్దం కాకపోయినా కూడా ఆ కలశాలు ఎనిమిదేళ్లకే రంగు ఎలా మారిపోతున్నాయి అని అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube