సాధారణంగా కలలు రావడం అనేది ప్రతి ఒక్కరి విషయంలో సర్వ సాధారణంగా జరిగే అంశం.ఈ విధంగా కొందరికి అందమైన కలలు వస్తే మరి కొందరికి కొన్ని చేదు అనుభవాలను కలిగించిన కలలు వస్తాయి.
ఈ క్రమంలోనే కొందరికి కలలో జంతువులు కనిపిస్తూ ఉంటాయి.ఈ విధంగా జంతువులు కళ్ళలో కనిపించడానికి కూడా ఒక కారణం ఉందని పెద్ద వారు చెబుతుంటారు.
అయితే జంతువులు మన కళ్ళలో కనిపించే విధానం బట్టి మన జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి.ఏ జంతువు ఏవిధంగా కనిపిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…
*కుక్కలు మన కలలో కనిపిస్తే మనం మన శత్రువు పై విజయం సాధిస్తున్నామని సంకేతం.
ఈ క్రమంలోనే ప్రాణ స్నేహితులు కూడా దూరమవుతారని దీని అర్థం.
*మన కలలో తెల్ల పిల్లి కనిపిస్తే కష్టాలు రాబోతున్నాయని అదేవిధంగా నల్లపిల్లి కనిపిస్తే మానసిక సామర్థ్యాలు ఉపయోగించడానికి వెనక అడుగు వేస్తున్నారని అర్థం.
అదేవిధంగా కలలో పిల్లిని తరుముతున్నట్లు కనబడితే మన జీవితంలో రాబోయే అడ్డంకులు తొలగిపోతాయి.

*కొందరికి ఒంటె కలలో కనిపిస్తే ఎంతో పెద్ద సమస్యలను మీ భుజాలపై పడబోతోందని అర్థం.అదేవిధంగా కలలో నల్లటి గుర్రం కనిపిస్తే మీపై క్షుద్రపూజలు చేపడ్డాయని సంకేతం.అదేవిధంగా తెల్లటి గుర్రం కనబడితే మీకు జీవితంలో అదృష్టం రాబోతుందని అర్థం.

*కలలో ఏనుగు కనబడితే త్వరలోనే మీకి లక్ష్మీకటాక్షం కలుగుతుంది.అదే ఆవు కనపడితే ఎంతో విధేయతతో మెలుగుతారని అర్థం.ఎద్దు కలలో కనపడితే అనుకోని సంపద మీ ఇంటికి చేరుతుంది.ఈ క్రమంలోనే ఆంబోతు కలలో కనబడితే మీ కోరికలలో నియంత్రణ లేదని అర్థం.
*ఎద్దు మిమ్మల్ని పొడిచినట్టు కలలోకి వస్తే మీరు త్వరలోనే ఎవరితోనైనా గొడవ పడతారని అర్థం.అదేవిధంగా పాము కలలో కనబడితే మీరు పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారని సంకేతం.