ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.59
సూర్యాస్తమయం: సాయంత్రం 06.30
రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: కృత్తిక మంచిది కాదు.
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు.అవసరాలను బట్టి ముందుకు సాగుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉన్నాయి.ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.
వృషభం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.దాని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఏ విషయం గురించి అయినా ప్రశాంతంగా ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి.
మిథునం:

ఈరోజు మీరు అన్ని విషయాల్లో ఆలోచించాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడమే మంచిది.సమయంను కాపాడుకోవాలి.
కర్కాటకం:

ఈరోజు మీరు చేసే పనిలో శ్రమ ఎక్కువగా ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.మీరంటే పడని వాళ్లకు దూరంగా ఉండటం మంచిది.ముఖ్యంగా కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచించండి.
సింహం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన దాని వల్ల ఒత్తిడి కాకుండా చూసుకోవాలి.ఒక వార్త మిమ్మల్ని బాధ పెడుతుంది.అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు.
ప్రతి ఒక్క విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కన్య:

ఈరోజు మీరు ఏ పని చేసిన ముందుకు సాగుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందుల్లోనే ఎదుర్కొంటారు.
తులా:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ కోసం ప్రయత్నించాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం:

ఈరోజు మీరు చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు.అనుకున్న పనులు పూర్తి చేసేటప్పుడు మనోధైర్యంతో ముందుకుసాగాలి.
కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఇతరులు నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
మకరం:

ఈరోజు వ్యాపారస్తులు భవిష్యత్తులో పెట్టుబడి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.కొన్ని కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కుంభం:

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనుల నుంచి ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మీనం:

ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులు అని కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
LATEST NEWS - TELUGU