కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారో,వారి గుణగణాలు,వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.ఈ రాశి వారు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఎవరైనా వీరికి నమ్మకద్రోహం చేస్తే అసలు భరించలేరు.జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తే మాత్రం జీవితాంతం క్షమించలేరు.
వీరు జీవిత భాగస్వామి పట్ల చాలా ప్రేమను కలిగి
ఉంటారు.అలాగే కన్యా రాశి వారు తమ జీవిత భాగస్వామి తనకు ఎక్కువ
ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు.

వీరు ఒక్కసారి ఎవరిని అయినా నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని
నిలబెట్టుకుంటారు.ఈ రాశి వారు ఎక్కువగా తమకంటూ ఒక ప్రత్యేక ప్రదేశం
ఉండాలని కోరుకుంటారు.ఆ ప్రత్యేక ప్రదేశంలో వారికీ ఇష్టమైన వారు మాత్రమే
ఉండాలని కోరుకుంటారు.కన్యా రాశి వారు తమకు నచ్చని వ్యక్తులతో
మాట్లాడమంటే అసలు మాట్లాడరు.కేవలం నచ్చిన వ్యక్తులతో మాత్రమే
మాట్లాడతారు.కాబట్టి ఈ విషయంలో జీవిత భాగస్వామి అర్ధం చేసుకొనే ప్రయత్నం
చేయాలి.
ఈ రాశి వారికి గందరగోళ పరిస్థితులు,హడావిడిగా గడపటం,గొడవలతో గడపటం అనేవి అసలు నచ్చవు.చాలా ప్రశాంతతను కోరుకుంటారు.ఇంటిలో ఉన్నా,ఆఫీస్ లో ఉన్నా సరే ఎక్కువగా ప్రశాంతతను కోరుకుంటారు.ఈ రాశి వారికి అసలు కోపం రాదు.
ఒకవేళ వస్తే భరించటం కష్టం అలాగే కోపాన్ని తగ్గించటం కూడా చాలా కష్టమైన పనే.కాబట్టి జీవిత భాగస్వామి కన్యా రాశి వారికీ కోపం రాకుండా చూసుకోవాలి.