సాధారణంగా చాలామంది ప్రతి రోజు పూజ చేస్తూ ఉంటారు.ఇక మరికొందరు శుక్ర, శనివారాలు మాత్రం పూజిస్తుంటారు.
ఇలా ఒక్కొక్కరు ఒకరకంగా తగిన విధంగా పూజలు చేస్తూ ఉంటారు.అయితే కర్పూరం( Camphor ) దేవుడికి హారతిని ఇవ్వడాని కోసం ఉపయోగిస్తారు.
కానీ ఈ కర్పూరం వలన మన ఇంట్లో బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవచ్చు అన్న విషయం మనందరికీ తెలియదు.కర్పూరం అనేక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అయితే రోజు ఇంట్లో కర్పూరం పెట్టుకోవడం వలన ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో ప్రతిరోజు కర్పూరం వెలిగిస్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం.

ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం( Vastu Dosham ) ఉన్న కానీ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటాము.అలాంటి వాస్తు దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఇంటి మూలలోన కర్పూరం వెలిగించి ఉంచాలి.ఇలా ఉంచడం వలన వాస్తు దోషాలు తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఇక ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన మనసు తేలిక పడుతుంది.వెలిగిస్తే వచ్చే ధూపం నుండి వచ్చే సువాసన పీల్చడం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.కాబట్టి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది.
అంతేకాకుండా ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) ఉంటుంది.

దీంతో సంపద, శ్రేయస్సు కలుగుతుంది.అంతేకాకుండా భార్య, భర్తల మధ్య కూడా తగాదాలు తగ్గిపోతాయి.అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి.
దీంతో మధురమైన జీవితాన్ని గడపవచ్చు.ఇంట్లో లేదా కార్యాలయంలో కర్పూరాన్ని వెలిగించడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఆర్థికంగా వృద్ధి చెందాలంటే ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన జీవితంలో డబ్బుకి, ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు.దీని వల్ల చికాకులు కూడా తగ్గుతాయి.
ఒత్తిడి( Stress ) కూడా తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఈ విధంగా మీ జీవితం ఆనందంగా ఉంటుంది.