ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలోని భూనీల సమేత భావనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలోని భూనీల సమేత భావనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది.స్వామివారి గర్భగుడిలోని మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకాయి.ఈ దృశ్యం ఆదివారం ఉదయం 5.50 నుంచి 6.05 గంటల సమయంలో 15 నిమిషాలపాటు ఆవిష్కృతమైంది.ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

 A Miracle Was Discovered At The Bhavanarayana Swamy Temple, Miracle , Bhavanaray-TeluguStop.com

ఈ అత్యద్భుతాన్ని భక్తులు తిలకించి తరించడానికి క్యూ కట్టారు.ఈ క్రమంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా.ప్రతి ఏడాది మార్చి 9,10 అలాగే అక్టోబరు 1,2 తేదీల్లో దక్షిణాయణ, ఉత్తరాయణ పుణ్యకాలాల్లో రెండుసార్లు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌ను తాకుతాయి.

 ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు. 

ఆ విధంగా దేవాలయాన్ని పూర్వం లో సూర్యుడి అధినాయకుడైన భృగుమహర్షి నిర్మించడం వల్ల సూర్య కిరణాలు మూలవిరాట్టు పై పడుతున్నాయని ఆలయ గోడలపై ఉన్న శాసనాలు చెబుతున్నాయి.

గాలి గోపురం నుంచి సుమారు 100మీటర్ల దూరంలో అతి తక్కువ ఎత్తులో ఉన్న ముఖద్వారం నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామిని తాకడం ఇక్కడ విశేషం.అర్చకులు బృందావనం రాఘవాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

వాతావరణం అనుకూలంగా ఉంటే బుధవారం వరకూ సూర్యకిరణాలు స్వామిని తాకుతాయని అర్చకులు తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube