క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గుడ్ ఫ్రైడే కూడా ఒకటి అని దాదాపు చాలా మందికి తెలుసు.ఏసుక్రీస్తుని శిలువ వేసిన రోజు ను గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే మార్చి 29 వ తేదీన జరుపుకుంటారు. కల్వరి గిరి( Kalvari Giri ) మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ని జరుపుకుంటారు.
అందరూ ఆ రోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు.తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు.
బైబిల్( Bible ) ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు.

కానీ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన ఏసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు.పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు.అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావించి గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు.
లోక రక్షణ కోసం యేసు క్రీస్తు( God Jesus ) వారు తల్లి మరియా గర్భణ జన్మించారు.ప్రజలను చెడు నుంచి మంచి వైపు నడిపించడం కోసం శ్రమించారు.
దైవ కుమారుడైన ఏసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకు వచ్చి మనుషులు పడే కష్టాలను అనుభవించారు.పాపాలు చేస్తున్న వారిని సన్మార్గంలో నడిపించడం కోసం ప్రయత్నించారు.ఆయన వెంట ఎప్పుడూ 12 మంది శిష్యులు ఉండేవారు.ప్రభు బోధనలు వినెందుకు ఎంతో మంది ఆసక్తి చూపించేవారు.
అయితే ప్రజలందరూ ఏసుక్రీస్తు మాటలకు ప్రభావితమవుతున్నారని రోమీయులు కక్ష కట్టారు.ఎలాగైనా ఆయనను అణిచివేయాలని చూస్తారు.
రోమా సైనికులకు ఏసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు సాయం చేస్తాడు.అతడు డబ్బు మనిషి.

యాదుల రాజుగా తనని తను ప్రకటించుకున్నాడని అబద్ధపు నింద మోపి ఏసుక్రీస్తుని రొమసైనికులకు అప్పగిస్తాడు.ఇస్కారియోతు చేసే ద్రోహం గురించి ఏసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు.అయినప్పటికీ ఆయన ప్రజలను పాపాల నుంచి రక్షణ కోసం ప్రాణ త్యాగం చేయాలనేది తన కర్తవ్యం గా భావిస్తారు.గుడ్ ఫ్రైడే ముందు రోజు తన శిష్యులు అందరికీ ఏసుక్రీస్తు ప్రభువు రాత్రి భోజనం ఇచ్చారు.
మరుసటి రోజు గెత్సెమని తోటలో ప్రార్థన చేస్తుండగా రొమ్ సైనికులు వచ్చి ఏసుక్రీస్తు బందీగా చేసుకుంటారు.ఏసుక్రీస్తు అంటే నచ్చని కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి, దుర్భాషలాడుతూ శిలువ వేయాలని గట్టిగా అరుస్తారు.
రూమ్ చక్రవర్తి అలాగే శిలువ శిక్ష విధిస్తాడు.రూమ్ సైనికులు ఏసుక్రీస్తు వారిని అత్యంత దారుణంగా హింసించి ముళ్ళ కొరడాలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తారు.యూదుల రాజువి కదా అంటూ హిళనగా మాట్లాడుతూ ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని గుచ్చుతారు.శరీరమంతా మాంసం ముద్దగా మారి రక్తం దారిలో ప్రవహిస్తున్న బాధను ఆయన అనుభవించారు.