ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

సృష్టికి మూలం ఓంకారం.ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు.అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు.నర్మదా నమీద తల్లి ఒడ్డున ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర క్షేత్రం విరాజిల్లుతోంది.ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం.ఆత్మ, పరమాత్మలకు ప్రతీకగా పరమ శివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర్ ప్రణవ లింగంగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది.

 Do You Know The Om Kareshwara Temple Story Om Kareshwara Temple, Devotional, Ma-TeluguStop.com

ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం.

పూర్వం స్వర్గాన్ని దానవులు ఆక్రమించుకొని దేవతలను హింసలకు గురి చేసిన సమయంలో ఇంద్రుడు పరమేశ్వరున్ని పూజించాడు.

జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడు పాతాళ లోకం నుంచి లింగాకారంలో వెలసి దానవుల బారి నుంచి స్వర్గాలన్ని రక్షించి తిరిగి దేవతలకు అప్పగిస్తాడు.నర్మదా నదీ తీరా బ్రహ్మ, విష్ణువు వెలసిన క్షేత్రాన్ని విష్ణుపురి అంటారు.

ఈ పరమేశ్వరుడు వెలసిన క్షేత్రాన్ని రుద్రపురి అని పిలుస్తారు.ఆ రుద్రపురిలోనే మమలేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది.

పురాణ కాలంలో మాంథాత రాజు ఇంద్రుని ఆశీస్సులతో రాజ్యాధికారాలను స్వీకరిస్తాడు.అతను పరమ శివ భక్తుడు.

నిత్యం ఆ పరమేశ్వరుడిని పూజిస్తూ ఉండేవాడు.నర్మదా నదీ పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి వెలువడి ఆ ఓంకారేశ్వరున్ని నిత్యం అభిషేకిస్తాయి.

తర్వాతి కాలంలో మాంధాత ఈ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా ప్రకటించాడు.ఈ ప్రదేశాన్ని ఓంకార మాంధాతగా కూడా పిలుస్తారు.

ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ పర్వతంపై అగస్త్యుడి లాంటి గొప్ప మునులు ఎందరో ఈ ప్రదేశంలో తపస్సును ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube