ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.46
సూర్యాస్తమయం: సాయంత్రం 05.43
రాహుకాలం: ఉ.10.30 మ12.00 వరకు
అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 మ1.39 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని దూరం ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం పై మరింత శ్రద్ధ తీసుకోవాలి.
వృషభం:
ఈరోజు మీకు కష్టానికి తగిన ఫలితం దక్కదు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిథునం:
ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టడం మంచిది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
కర్కాటకం:
ఈరోజు మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న చర్చలు చేయడం మంచిది.
సింహం:
ఈరోజు మీరు ఎప్పటినుండో నిలిపివేయబడ్డ పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
కొన్ని దూర ప్రయాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
కన్య:
ఈరోజు మీరు బయటకు ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి సమయానికి అందుతుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
తులా:
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగా అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.భూమికి సంబంధించిన విషయాలలో మీరు దూర్చకుండా ఉండడం మంచిది.మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుంభం:
ఈరోజు మేరీ తన పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీనం:
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.మీ మాటలతో ఇతరుల మనసును ఆకట్టుకుంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
LATEST NEWS - TELUGU