ఒక్కోసారి మనం చేసే చిన్న తప్పులే పెద్ద సమస్యను తెచ్చి పెడతాయి.వాటికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
తెలిసి చేసినా, తెలియక చేసినా .ఈ పొరపాట్లతో ఇబ్బందులు వచ్చిపడతాయి.వాస్తుకు సంబంధించిన ఏ చిన్న అంశం అయినా ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది.ఏ వస్తువు ఎక్కడ ఉండాలి.ఏ పని ఎలా చేయాలి ద్వారాలు, కిటికీలు సహా చాలా అంశాలు తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్థాయి.ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొవడం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం వంటివి జరుగుతుంది.
అంతే కాకుండా రుణ బాధలు ఇబ్బంది పెడతాయి.వాస్తు ప్రకారం మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లు వారిని చాలా కాలం వరకు ఆర్థికంగా దెబ్బతిస్తాయి.
రోజూ మనకు తెలియకుండా జరిగే పొరపాట్లకు మనం మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం
చాలా మంది ఇళ్లలో చెత్త డబ్బాలను ఇంటి బయట లేదంటే ప్రవేశ ద్వారం వద్ద పెడతారు.
వాస్తు ప్రకారం ఇలా డస్ట్ బిన్ ను ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు.ఇలా చేస్తే ఇంట్లో ఉండే ధనలక్ష్మీకి కోపం తెప్పించిన వాళ్లం అవుతాం.
ఈ ఒక్క పొరపాటు ధనికులను కూడా బీద వాళ్లను చేస్తుంది.ఇంట్లోకి వచ్చేప్రవేశ ద్వారం వద్ద ఎప్పుడూ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి.
అంతకంటే ముఖ్యమైనది ఎంట్రీ డోర్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ డస్ట్ బిన్ ను ఉంచకూడదు అనే విషయాన్ని మర్చిపోవద్దు.చాలా మంది మంచంలో కూర్చుని భోజనం చేస్తుంటారు.
కానీ ఇది ఏమాత్రం ఆచరణీయ పద్ధతి కానే కాదు.ఎందుకంటే వాస్తు శాస్త్రంలో దీని గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇలా మంచం మీద హాయిగా కూర్చుని తినవద్దని వాస్తు శాస్త్రంలో ఉంది.ఇలా తరచూ చేస్తే ఇంట్లో ఉండే ధనలక్ష్మీ ఆగ్రహానికి గురవుతారు.
ఈ పొరపాటు వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.ధనికులు కూడా పేద వారిగా మారే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి ఈ తప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.

రాత్రిపూట వంటగదిలో ఖాళీ పాత్రలను ఉంచడం కూడా చాలా అశుభం.కొన్ని కారణాల వల్ల మీరు రాత్రి పూట మిగిలి పోయిన పాత్రలను కడగకపోతే, వాటిని వంట గదిలో ఉంచడం మర్చి పోవద్దు.రాత్రి పడుకునే ముందు కిచెన్ ను శుభ్రం చేయండి.
లేకుంటే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ ఉంటుంది.ఆధ్యాత్మిక గ్రంథాల్లో దానానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పబడింది.
లేని వారికి దానం చేయడం అంటే భగవంతునికి సేవ చేయడంతో సమానం.అయితే దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని గమనించాల్సి ఉంటుంది.
సాయంత్రం పూట పాలు, పెరుగు, ఉప్పు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి.వాస్తు ప్రకారం సాయంత్రం పూట ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.
అలాగే రాత్రి పూట వంట గదిలో లేదా బాత్రూములో ఏ పాత్రను కూడా ఖాళీగా ఉంచకూడదు.ఇది చాలా అశుభం అని శాస్త్రాలు చెబుతున్నాయి.
బాత్‌రూములో వాడే బకెట్ లో ఎప్పుడూ నీళ్ళు ఉండేలా చూసుకోవాలి.దీని వల్ల ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గు తుందని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది.