వేప చెట్టు అనేక ఔషధాలకు పవర్ హౌస్ లాంటిది అనడంలో ఎటువంటి సందేహం లేదు.వేప చెట్టు నుంచి వచ్చే ఆకులు, పువ్వుల నుంచి బెరడు, వేర్ల వరకు అన్నీ మనకు ఉపయోగకరమే.
అందుకే వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణి అంటారు. ఆరోగ్య ప్రయోజనాల గురించి పక్కన పెడితే.
వేప ఆకులతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చు.వివిధ చర్మ సమస్యలకు వేపాకుతో సులభంగా చెక్ పెట్టవచ్చు.
మొటిమలు, మొండి మచ్చలతో(acne ,stubborn scars) బాధపడుతున్న వారికి వేపాకులు ఎంతో మేలు చేస్తాయి.కొన్ని ఫ్రెష్ వేపాకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో వన్ టీ స్పూన్ తేనె(Honey), వన్ టేబుల్ స్పూన్ పాలు(Milke) వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ రెమెడీని పాటిస్తే మొటిమలు, మచ్చలు పరారవుతాయి.క్లియర్ స్కిన్ ను పొందుతారు.
గ్లోయింగ్ అండ్ షైనీ స్కిన్ కోసం వేపాకు మరియు తులసి ఆకులను సమానంగా తీసుకుని రోజ్ వాటర్ సహాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి(Multani mitti), వన్ టీ స్పూన్ తేనె (Honey)మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చర్మం కాంతివంతంగా అందంగా మెరిసిపోతుంది.స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.అదే సమయంలో చర్మం ఆరోగ్యవంతంగా కూడా మారుతుంది.
వేపలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి.వేపాకు పేస్ట్ లో వన్ టీ స్పూన్ పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ దూరం అవుతాయి.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.