ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సముద్రంలో కయాక్ పడవలో వెళ్తున్న ఒక జంటకు సంబంధించిన వీడియో అది.
ప్రశాంతంగా సముద్రపు అందాలను ఆస్వాదించాల్సిన సమయంలో, భర్త మాత్రం హఠాత్తుగా తెడ్డు వేయడం ఆపేశాడు.ఎందుకో తెలుసా గొడవ జరిగిందట, దాన్ని అక్కడే సెటిల్ చేసుకోవాలట.
అతని ఈ చర్య చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు.చాలామంది ఈ ఫన్నీ సీన్ పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
అరుషి త్రివేది అనే ఇన్‌స్టా యూజర్(Insta user Aarushi Trivedi) ఈ వీడియోను పోస్ట్ చేసింది.కారులో ప్రయాణిస్తున్నప్పుడు భార్యాభర్తలు సరదాగా కయాకింగ్ చేస్తున్నారు.ఇంతలో భర్త కార్తీక్(Husband Karthik) పడవను పూర్తిగా ఆపేశాడు.వ్యూ పాయింట్ చూద్దామని కాదు, అసలు విషయం వేరే ఉంది.
ఇంతకుముందు జరిగిన గొడవను సెటిల్ చేసుకోవాలట ఆయనగారు.ఆయన డిమాండ్లు ఏంటో తెలుసా, ట్రిప్ మొత్తం తన భార్య నవ్వుతూ ఉండాలంట, ఫోటోలు బాగాలేవు అని కంప్లైంట్ చేయకూడదంట.
ఇది పెద్ద గొడవ కాదు, జస్ట్ సరదాగా జరిగిన సీన్ అంతే.కానీ నెటిజన్లను మాత్రం నవ్విస్తుంది.అరుషి ఈ వీడియోకు ఫన్నీ క్యాప్షన్ కూడా పెట్టింది.“కయాక్ కదలాలంటే(kayak argument) నేను సారీ చెప్పాల్సి వచ్చింది.నేను ఎంత ట్రై చేసినా కార్తీక్ సాయం లేకుండా అది కదలలేదు.లేడీస్ ప్రో టిప్: మీరు లైఫ్ గార్డ్స్ లేని సముద్రంలో, ఇద్దరు వెళ్లే కయాక్ పడవలో ఉంటే మాత్రం సారీ చెప్పేయండి.లేదంటే బలమైన నీటి ప్రవాహంలో మునిగిపోయే ప్రమాదం ఉంది” అంటూ సరదాగా రాసుకొచ్చింది.
రెండు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.కామెంట్స్ సెక్షన్ అయితే నవ్వులతో నిండిపోయింది.“గొడవలు సెటిల్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ మార్గం.నేను నోట్ చేసుకుంటున్నా” అని ఒకరు కామెంట్ చేశారు.“సూపర్ క్యూట్ జంట, గొడవలను ఇంత బాగా హ్యాండిల్ చేయడం చూస్తుంటే ముచ్చటేస్తుంది” అని మరొకరు కామెంట్ పెట్టారు.“వీళ్ళు గొడవ పడుతూ ఉంటే పడవ ఎక్కడో కొట్టుకుపోయిందేమో” అని ఇంకొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.కొంతమంది అయితే ఇందులో లైఫ్ లెసన్ కూడా ఉందని అంటున్నారు.“ప్రతి గొడవ ఇలాగే సెటిల్ చేసుకోవాలి.అరుపులు, కేకలు లేకుండా ప్రశాంతంగా బోట్ రైడ్ చేస్తూ” అని ఒక నెటిజన్ రాసుకొచ్చారు.
ఏదేమైనా ఈ ఫన్నీ వీడియో చాలా మంది జంటలకు కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది.నడి సముద్రంలో గొడవలు సెటిల్ చేసుకోవడం కూడా ఒక పద్ధతేనా ఏంటి అని ఆలోచిస్తున్నారు కాబోలు.