దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా.సినిమా రంగంపైనా కోలుకోలేని దెబ్బకొడుతోంది.
తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.అన్ని ఇండస్ట్రీల్లో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు.
ఇందులో దర్శకులు ఎక్కువగా చనిపోతున్నారు.టాలీవుడ్ లోని దాదాపు అర డజను మంది యంగ్ డైరెక్టర్స్ మాయదారి మహమ్మారి సోకి కన్నుమూశారు.
అందరూ వయసులో చాలా చిన్న వాళ్లు.కేవలం ఒకటి, రెండు సినిమాలు చేసి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న వాళ్లను కనికరం లేకుండా కాటేసింది కరోనా.
తాజాగా మరో దర్శకుడు కోవిడ్ తో కన్నుమూసాడు.నంద్యాల రవి కేవలం 42 ఏళ్ల వయసులో కరోనాతో పోరాడి ఓడాడు.
నంద్యాల రవి.నాగశౌర్య, అవికా గోర్ జంటగా వచ్చిన లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాను తెరకెక్కించాడు .అంతకు ముందు నేను సీతామాలక్ష్మి, కళ్యాణ్ రామ్ అసాధ్యుడు సినిమాలకు కథలు ఇచ్చాడు.రెండో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం కొనసాగుతుండగానే కోవిడడ్ కాటుకు బలయ్యాడు.
ఈ మధ్య శ్రవణ్ అనే దర్శకుడు కూడా మరణించాడు.ఇతడు.
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియుడు సినిమాను తెరకెక్కించాడు శ్రీ విష్ణు హీరోగా పెట్టి మా అబ్బాయి సినిమాను తెరకెక్కించిన కుమార్ వట్టి కూడా కరోనా సోకి చనిపోయాడు.
శర్వానంద్ హీరోగా వచ్చిన స్వీకారం సినిమాకు కో-డైరెక్టర్ గా పనిచేసిన రాజా కూడా కరోనాకు కన్నుమూశాడు.
త్వరలోనే ఆయన దర్శకుడిగా పరిచయం కావాలని కథ రెడీ చేసుకుంటున్నాడు.ఇలా ఒకరు ఇద్దరు కాదు చాలా మంది చనిపోయారు.తమిళం, కన్నడంలో కూడా చాలా మంది యువ దర్శకులు ఈ మాయదారి మహమ్మారికి బలయ్యయారు.ఎన్నో కలల్లో ఉన్న వారి జీవితాలు ముగిసిపోయాయి.
బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కుర్రాళ్లను కనికరం లేకుండా కాటు వేస్తోంది.మరెన్నో కుటుంబాలను రోడ్డు మీద పడేస్తుంది.