ముఖ సౌందర్యాన్ని చెడగొట్టే వాటిలో మొటిమలు( Pimples ) ముందు వరుసలో ఉంటాయి.ముఖం ఎంత తెల్లగా ఉన్నా కూడా మొటిమల వల్ల కాంతిహీనంగా కనిపిస్తారు.
అందుకే మొటిమలు లేని చర్మం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ ఫేస్ వాష్ ను మీరు వాడాల్సిందే.ఈ ఫేస్ వాష్ మొటిమలను మాయం చేస్తుంది.
ముఖాన్ని కాంతివంతంగా, అందంగా మెరిపిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫేస్ వాష్( Face Wash ) ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీhttps://telugustop.com/wp-admin/post-new.php జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) మరియు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ), వన్ టేబుల్ స్పూన్ తేనె, ఒక కప్పు రోజ్ వాటర్ మరియు రెండు టేబుల్ స్పూన్లు బేబీ వాష్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన ఫేస్ వాష్ అనేది సిద్ధం అవుతుంది.
ఇప్పుడు ఈ ఫేస్ వాష్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
వేప, పసుపు, అలోవెరా జెల్, తేనె, రోజ్ వాటర్ లో ఉండే పలు సుగుణాలు చర్మానికి చక్కని పోషణ అందిస్తాయి.మొటిమలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
క్లియర్ స్కిన్( Clear Skin )) ను మీ సొంతం చేస్తాయి.

అలాగే ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను ఉపయోగించడం వల్ల మీ ముఖ చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.ఏమైనా మచ్చలు ఉంటే అవి మాయం అవుతాయి.స్కిన్ హెల్తీగా( Healthy Skin ) తయారవుతుంది.
కాబట్టి మొటిమలు లేని మెరిసే ముఖ చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.