పుట్టినరోజు వేళ పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో... ఈసారైనా కలిసొచ్చేనా?

సాధారణంగా చాలామంది తమ పేర్లు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.అంతేకాకుండా పేరుకు ముందు లేదా చివరిన వారి కుటుంబ సభ్యుల పేర్లు కలిసి వచ్చేలాగా మార్చుకుంటూ ఉంటారు.

 Akash Puri Change His Name On Birthday Special ,puri Jagannath ,akash Jagannath,-TeluguStop.com

ఇలా వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా పేర్లను కూడా పెట్టుకుంటూ ఉండటం మనం చూస్తున్నాము.ఈ క్రమంలోనే పలువురు హీరోలు కూడా అప్పుడప్పుడు తమ పేర్లను మార్చుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న ఆకాష్ పూరి ( Akash Puri ) తన పేరును మార్చుకున్నారు.

ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( Puri Jagannath ) కుమారుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఆకాష్ ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.మెహబూబా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పటివరకు సరైన స్థాయిలో ఒక హిట్ కూడా అందుకోలేదు.చివరిగా చోర్ బజార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా ఇటీవల ఆకాశ్ తన 25వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఇలా తన 25వ పుట్టిన రోజు ( Birthday ) సందర్భంగా ఈయన తన పేరులో మార్పులు చేసుకున్నారని తెలుస్తోంది.ఇప్పటివరకు తనని ఆకాష్ పూరి అంటూ అందరూ పిలిచేవారు.

అయితే ఇప్పటినుంచి ఆకాష్ జగన్నాథ్ (Akash Jagannath) అని పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అయితే తన పేరు చివరిన  తన తండ్రి పేరును పెట్టుకున్నారు.

ఇలా ఆకాష్ తన పేరు మార్చుకోవడంతో ఇప్పటికైనా తనకు ఇండస్ట్రీలో కలిసి వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.ఇక తన తండ్రి స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ ఆకాష్ మాత్రం తన తండ్రి డైరెక్షన్ లో ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా నటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube