ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు( NTR centenary celebrations ) డుమ్మా కొట్టిన తారక్( Tarak ) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారాడు.తారక్ ఎదో జీవితానికే బిక్ష చంద్ర బాబు( Chandra Babu ) వేసినట్టు, స్థాయి ఇచ్చాడు, పెళ్లి చేసాడు, మోసం చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో కూతలు వినిపిస్తున్నాయి.
కానీ ఎవరెన్ని ప్రగల్భాలు పలికిన తారక్ మంచి పని చేసాడు అనేది కొందరి వాదన.ఈ సమయంలో ఎలాంటి గొప్ప పని జరిగిన అది బాబు ఖాతాలోకి వెళ్తుంది.
పైగా ఎన్నికలు సమీపిస్తున్న ఈ టైం లో బాబు గెలిస్తే అతడే సీఎం అవుతాడు లేదా అతడి వారసుడు లోకేష్( Lokesh ) పట్టం కట్టించుకుంటాడు కానీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చే లాభం ఏం ఉంది చెప్పండి.
తన తాత నందమూరి రామారావు ( Nandamuri Rama Rao )స్థాపించిన పార్టీ ఈ రోజు నారా వారంతా ములుగుతుంది.సో ఇప్పుడు పార్టీ కి, ఆ పార్టీ నివహించే కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది.తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ( Harikrishna ) కష్టం టీడీపీ పార్టీ ని చంద్ర బాబు చేతిలో వదిలేయడానికి కాదు కదా.అయిందేదో అయ్యింది.ఎన్టీఆర్ ని చావు దెబ్బ కొట్టి పార్టీ ని, అధికారాన్ని లాక్కున్నాడు.
కానీ ఇప్పుడు తెలివి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ కి.ఎవరి పార్టీ ఎవరు చేతుల్లో ఉందో తెలిసి వచ్చింది.మొదట్లో బాబు కి మద్దతు పలికి ప్రచారం చేసిన, ఆ పై మళ్లి అటు వైపు చూసింది లేదు.
పైగా ఇప్పుడు బాబు గెలిస్తే టీడీపీ( TDP ) పార్టీ మళ్లి పూర్వ వైభవాన్ని తెచ్చుకొని లోకేష్ మరింత క్రేజ్ సంపాదించుకుంటాడు.ఈ టైం లో బాబు ఓడిపోతే ఆ ప్రభావం మరింత పడుతుంది బాబు పై.ప్రెజర్ కి గురి అయ్యే అవకాశం లేకపోలేదు.దాంతో జూనియర్ ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఉన్న నాయకుడు వస్తే తప్ప పార్టీ మనుగడ ఉండదు అనే విషయం సాధారణ ప్రజల నుంచి టీడీపీ కార్యకర్తల వరకు అందరికి అర్ధం అవుతుంది.అది ఈ సారి జరగకపోయినా మరి కొన్నేళ్లు ఎదురు చూస్తే తప్పక జరుగుతుంది.
అప్పటికి తారక్ మరింత అగ్ర నటుడిగా వెలిగిపోయే అవకాశం ఉంది.మరి ఇన్ని లెక్కలు వేయగల తారక్ ఇప్పుడు ఎవరి కోసం శతజయంతి వేడుకలకు హాజరు కావలి.
అందువల్ల అతడికి లేదా నందమూరి కుటుంబానికి ఒరిగే లాభం ఏముంది ?
.