1.ఆర్జెయూకేటీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఆర్జెయుకేటి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
2.మార్కెట్ లోకి టియాగో ఈవీ
టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది.
3.వరంగల్ లో కేసీఆర్ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ అక్టోబర్ 1 వరంగల్ లో పర్యటించనున్నారు.
4.కేంద్ర మంత్రులపై హరీష్ రావు కామెంట్స్
కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చుడు పోవుడు తప్ప తెలంగాణ కు చేసింది ఏమీ లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు.
5.పోలవరం పై ముగిసిన వర్చువల్ సమావేశం

పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ వర్చువల్ సమావేశం ముగిసింది.
6.ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో నాలుగో రోజు ధనలక్ష్మి అలంకారంలో లక్ష్మీ తయారు అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
7.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్

అన్ని వర్గాలను మోసం చేయడమే కేసిఆర్ కు తెలుసునని రాష్ట్రాన్ని దరిద్రం పాలు చేసింది చాలదన్నట్లు ఆయన దేశం మీద పడ్డారని తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్ చేశారు.
8.ఎంపీ పార్టీ ఎన్నికపై పిటిషన్ పునర్విచారణ
గత లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు పునర్వచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
9.నీట్ ఉచిత కోచింగ్ కు ఆహ్వానం

హైదరాబాద్ హయత్ నగర్ లోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల ప్రాంతీయ కోఆర్డినేటర్ కళ్యాణి తెలిపారు.
10.భవన నిర్మాణ కార్మికుల ప్రమాద బీమాను పెంచాలి
భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమాను 10 లక్షల పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
11.మహా పాదయాత్ర

అమరావతి రైతుల పాదయాత్ర శ్రీరామ వరం చేరుకుంది.ఈ సందర్భంగా వైసీపీ సర్పంచ్ కామిరెడ్డి నాని ఇంటి వద్ద టిడిపి వైసిపి కార్యకర్తలు కోటపోటీగా నినాదాలు చేశారు.
12.భవాని దీక్ష దారులు దర్శనాలకు మాత్రమే రావాలి
దుర్గ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భవానీ దీక్ష దారులు కేవలం అమ్మవారి దర్శనాలకు మాత్రమే రావాలని దుర్గ గుడి ఆలయ స్థానాచార్యులు విష్మభట్ల శివ ప్రసాద్ శర్మ అన్నారు.
13.విశాఖ రైల్వే జోన్ పై ఎంపీ జివిఎల్ క్లారిటీ

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు.రైల్వే బోర్డు చైర్మన్ వీకే త్రిపాఠి తో తాను స్వయంగా మాట్లాడానని, రైల్వే జోన్ రావడంలేదని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన కూడా ఖండించారని జీవీఎల్ తెలిపారు.
14.చంద్రబాబు లోకేష్ సంతాపం.
తిరుపతి సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం ప్రకటించారు.
15.పాఠశాలలపై చర్యలు వద్దు : హై కోర్ట్

విద్యాహక్కు చట్టం విషయంలో పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
16.నాలుగో రోజుకు చేరిన టిడిపి నిరసన దీక్ష
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడానికి నిరసిస్తూ తిరువూరులో మైనార్టీల ఆధ్వర్యంలో టిడిపి నిరసన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది.
17.జనసేన నేతల అరెస్టు

కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం బంటుమిల్లి లో జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
18.గంజాయి సరఫరా లో ఏపీ అగ్రస్థానం
దేశంలోనే గంజాయి సరఫరా లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదికను విడుదల చేసింది.
19.సింహ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి.నేడు సింహ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగనున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,400 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -50,620
.