కంటి నిండా నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పోషకాల కొరత, జీవన శైలిలో మార్పులు, వయసు పైబడటం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కళ్ళ కింద నలుపు, ముడతలు వంటివి ఏర్పడుతుంటాయి.ఇవి చూసేందుకు అందవిహీనంగా కనిపించడమే కాదు అందాన్ని సైతం దెబ్బ తీస్తాయి.
అందుకే వీటిని నివారించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్స్, జెల్స్, సీరమ్స్ తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మాత్రం వారం రోజుల్లో కళ్ళ కింద నలుపు మరియు ముడతలను మాయం చేస్తుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ ను పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.
కంప్లీట్ గా కూల్ అయిన అనంతరం ఓ పల్చటి వస్త్రంలో వేసి జెల్‌ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పండిన ఒక అరటి పండు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ అరటి పండు పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల జెల్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద అప్లై చేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే గనుక వారం రోజుల్లోనే మీ కళ్ళ కింద నలుపు మరియు ముడతలు మాయం అవ్వడాన్ని మీరు గమనిస్తారు.