ఇన్ఫెక్షన్ ను నివారించి పాదాలను తెల్లగా మృదువుగా మార్చే సింపుల్ చిట్కా ఇదే!

అసలే వర్షాకాలం కొనసాగుతోంది.ఈ సీజన్లో పాదాలను సంరక్షించుకోవడం అంటే కత్తి మీద సామే.

 This Is A Simple Tip To Prevent Infection And Make Foot White And Soft! Simple-TeluguStop.com

అయితే వర్షపు నీటిలో తరచూ నడవడం వల్ల ఒక్కొక్కసారి పాదాలకు ఇన్ఫెక్షన్ సోకుతుంటుంది.ఆ ఇన్ఫెక్షన్ దురద, చికాకు, తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

దాంతో ఇన్ఫెక్షన్ నివారించుకోవడం కోసం రకరకాల ఆయింట్మెంట్స్ వాడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ చిట్కాను పాటిస్తే ఇన్ఫెక్షన్ పరార్ అవ్వడమే కాదు పాదాలు తెల్లగా మరియు మృదువుగా సైతం మెరుస్తాయి.

మరి ఇంకెందుకు లేటు ఆ నేచురల్ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందు ఐదు నుంచి ఆరు నిమ్మకాయలు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పై తొక్కను మాత్రం వేరు చేయాలి.ఈ తొక్కలను ఎండలో ఎండబెట్టుకోవాలి.కంప్లీట్ గా ఎండిన అనంతరం వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ నిమ్మ తొక్కల పొడిలో రెండు టేబుల్ స్పూన్లు ములేటి పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు శాండిల్ వుడ్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను ఒక డబ్బాలో నిప్పుకుని స్టోర్ చేసుకోవాలి.

Telugu Feet Care Tip, Care, Healthy Feet, Simple Tip, White Soft Feet-Telugu Hea

ఈ పొడిని ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న పొడిని వేసుకోవాలి.అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, రెండు టేబుల్ స్పూన్లు పుల్లటి పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం నిమ్మ చెక్క‌తో స్మూత్ గా రబ్ చేస్తూ వాటర్ తో పాదాలను క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒకసారి చేస్తే కనుక ఇన్ఫెక్షన్ క్రమంగా దూరమవుతుంది.అదే సమయంలో పాదాలు తెల్లగా మరియు మృదువుగా సైతం మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube