అమెజాన్ ప్యాకేజీలో రాకాసి బల్లి.. షాకైన కొలంబియా మహిళ..

కొలంబియా( Colombia ) దేశంలో నివసించే సోఫియా సెర్రానో అనే మహిళకు అమెజాన్ టీమ్‌ పెద్ద షాక్ ఇచ్చింది.ఆమె ఇటీవల అమెజాన్‌లో ఓ ఎయిర్ ఫ్రైయర్ (ఆహారం వేయించేందుకు ఉపయోగించే ఒక పాత్ర) ఆర్డర్ చేసింది.

 Spain Lizard In Amazon Package.. Shocked Colombian Woman.. Colombia, Sofia Serr-TeluguStop.com

అయితే ఆమెకు డెలివర్ అయిన పార్సెల్ ప్యాకేజీలో ఎయిర్ ఫ్రైయర్‌కు బదులు ఒక పెద్ద రాకాసి బల్లి కనిపించింది.సోఫియా తనకు జరిగిన ఈ విచిత్ర సంఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దీంతో, ఇది నెట్‌లో వైరల్‌గా మారింది.చాలా మంది ఈ విషయాన్ని చూసి నవ్వుకున్నారు, మరికొందరు ఆమె పరిస్థితిని చూసి అయ్యో పాపం అని కామెంట్లు చేశారు.

సోఫియా తనకు జరిగిన ఈ విచిత్ర సంఘటనను సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేసింది.ఆమె “మేం అమెజాన్ ద్వారా ఒక ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ చేశాం, కానీ దానికి బదులు కొత్త ఫ్రెండ్ వచ్చింది.ఈ మాన్‌స్టర్‌ లిజార్డ్ బాక్స్‌ లోపలికి ఎలా వెళ్ళిందో తెలియ రాలేదు.ఇది అమెజాన్ తప్పా లేక పార్సెల్ తీసుకెళ్లే వారి తప్పా తెలియదు.” అని తన పోస్టులో పేర్కొంది.

ఆర్డర్ చేసిన ఎయిర్ ఫ్రైయర్‌కు బదులుగా బల్లి వచ్చిందంటే, ఆమె ఎంత భయపడి ఉంటుందో ఉంచించుకోండి.అదే ఏ విషపురితమైన పాము అందులో ఉండి ఆమెను కాటేస్తే ఏమై ఉండేది? ఇది చాలా సీరియస్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు.ఆ పార్సెల్‌లో వచ్చినది స్పానిష్ రాక్ లిజర్డ్ అని అందరు చెప్పారు.

అది స్పెయిన్ దేశంలో కనిపించే రకమైన బల్లి.అయితే పార్సెల్‌ను డెలివరీ చేసిన కంపెనీ నుంచి సోఫియాకు ఏ విధమైన సమాధానం రాలేదు.

సోఫియా తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది వైరల్‌గా మారిపోయింది.లక్షలాది మంది ఈ పోస్ట్‌ను చూశారు.

చాలామంది ఈ విషయం గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారు.ఒకరు, “ఇలా జరిగితే నేను చచ్చిపోయేదాన్ని.

కానీ, ఆ చిన్న జంతువుపై కూడా జాలి వేస్తుంది.అది భయపడి, ఆకలితో, దాహంతో ఉంటుందేమో” అని రాశారు.

మరొకరు, “ఇప్పుడు నాకు కొత్త భయం పుట్టింది” అని కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube